విధాత, హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి ఫలితాలు జూన్ 30న విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఎస్సెస్సీ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఉదయం 11:30 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మే 23 నుంచి జూన్ 1వ తేదీ వరకు కొనసాగిన విషయం తెలిసిందే. నేడు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. తెలంగాణలో 05,09,275 మంది విద్యార్ధులు పరీక్షలు రాశారు.
విద్యార్ధులు పరీక్షలు రాసేందుకు గాను 2861 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో 70 శాతం సిలబస్ తోనే పరీక్షలు నిర్వహించారు. అంతేకాదు 11 పరీక్ష పేపర్లకు బదులుగా ఆరు పేపర్లకు మాత్రమే కుదించారు.