స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెల్లడి
విధాత: కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 70 వేల ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు స్టాప్ సెలక్షన్ కమిషన్ వెల్లడించింది.
రానున్న ఏడాదిన్న కాలంలో 10 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత వారం కోరిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కమిషన్ ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది. నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు నిరంతర ప్రయత్నాలు చేసిన కమిషన్ ఆయా పరీక్షల నోటీసులను వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తామని ప్రకటించింది. అభ్యర్ధులు కమిషన్ వెబ్ https://ssc.nic.in/ లో చూడాలని కోరింది.