Vidhaatha

Latest Telugu News

Menu Icon

పంట మార్పిడిపై ప్రభుత్వ ‘ఆపదమొక్కులు’.. నేతలు, అధికారుల చిత్తశుద్ధిపై అనుమానాలు

‘దాహమేసినప్పుడే బావి తవ్వడం’ ప్రారంభించినట్లుగా తెలంగాణలో పంట మార్పిడి ప్రకటన ప్రభుత్వానికి ఆపద మొక్కుగా మారిందనే విమర్శలు రైతాంగంలో వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో పంట మార్పిడికి సంబంధించిన పకడ్బందీ ప్రణాళిక రూపొందించడం, అమలు చేయడంలో ప్రభుత్వం, యంత్రాంగం వంద శాతం విఫలమైందని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతులు ఎందుకు మొగ్గు చూపడంలేదనే ప్రాథమిక కారణాలు అందరికీ తెలిసు. అయినా.. దీని మూలాలను నిజాయితీతో పరిష్కరించకుండా, కచ్చితమైన, నమ్మకమైన ప్రణాళిక రూపొందించి రైతులను ఒప్పించడంలో చిత్తశుద్ధి లేదనేది పదేపదే తేలిపోతోంది. మరో మాటలో చెప్పాలంటే దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని పరిశీలకులు అంటున్నారు.

పాడిపంటలు

సెభాష్‌ బొద్దింకలు.. ఢక్కాముక్కీలు తిన్న రాజకీయ పార్టీలకు ఇదెందుకు సాధ్యం కాలేదు?

నీట్‌ పరీక్ష పత్రం లీకేజీ వ్యవహారానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో శనివారం ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ప్రశాంతంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు స్వచ్ఛందంగా హాజరయ్యారు. మరి.. దేశంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ లేదా ప్రజల కోసమే బతుకుతున్నామనే కమ్యూనిస్టులు ఎందుకు యువతను ఆకర్షించలేక పోతున్నారు? వారు జెన్‌ జీ భాషను అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నారా? లేక ఉద్యమాలకు కదిలే నైజం యువతలో నశించిపోయిందనే నిర్ధారణకు వచ్చేశారా? వారి పిలుపులకు స్పందించని విద్యార్థులు.. కాక్రోచ్‌ జనతా పార్టీ పిలుపుతో ఎందుకు పోటెత్తారు?

విధాత ప్రత్యేకం

ఏడాదిగా దిక్కుమొక్కు లేని 18,500 కోట్ల శ్రీశైలం ఘాట్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రతిపాదన

శ్రీశైలం వెళ్లాలంటే ప్రస్తుతం ఘాట్‌ రోడ్డు ఒకటే మార్గం. అందులో అనేక మలుపులు, ఎత్తుపల్లాలు ఉంటాయి. నల్లమల అరణ్యంలో నుంచి వెళుతున్న కారణంగా.. ఆ రోడ్డుపై రాత్రిళ్లు ప్రయాణాలు నిషిద్ధం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏపీ, తెలంగాణలను కలుపుతూ శ్రీశైలం మీదుగా ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. కానీ.. ఇప్పటికీ ఈ విషయంలో ఎలాంటి జీవో విడుదల కాకపోవడంతో ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందనే చర్చలు సాగుతున్నది.

విధాత ప్రత్యేకం

లొంగిపోయిన మావోయిస్టుల పయనమెటు!?

ఆపరేషన్‌ కగార్‌ నేపథ్యంలో లొంగిపోయిన మావోయిస్టు కీలక నేతల రాజకీయ భవిష్యత్తేంటనే చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల సీపీఐ నాయకత్వాన్ని పలువురు మావోయిస్టు మాజీ నేతలు కలువడంతో ఈ చర్చ మళ్లీ ఊపందుకున్నది. లొంగుబాట్లకు ముందే భిన్నాభిప్రాయాలతో ఉన్న నాయకులు.. ఇప్పుడు అంతా కలిసి మూకుమ్మడి నిర్ణయాలు తీసుకుంటారా? లేక వ్యక్తులుగా తమ తమ అంచనాల మేరకు వివిధ రాజకీయ పార్టీల్లో చేరతారా? అనేది తేలాల్సి ఉంది.

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

సెభాష్‌ బొద్దింకలు.. ఢక్కాముక్కీలు తిన్న రాజకీయ పార్టీలకు ఇదెందుకు సాధ్యం కాలేదు?

సెభాష్‌ బొద్దింకలు.. ఢక్కాముక్కీలు తిన్న రాజకీయ పార్టీలకు ఇదెందుకు సాధ్యం కాలేదు?

నీట్‌ పరీక్ష పత్రం లీకేజీ వ్యవహారానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో శనివారం ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ప్రశాంతంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు స్వచ్ఛందంగా హాజరయ్యారు. మరి.. దేశంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ లేదా ప్రజల కోసమే బతుకుతున్నామనే కమ్యూనిస్టులు ఎందుకు యువతను ఆకర్షించలేక పోతున్నారు? వారు జెన్‌ జీ భాషను అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నారా? లేక ఉద్యమాలకు కదిలే నైజం యువతలో నశించిపోయిందనే నిర్ధారణకు వచ్చేశారా? వారి పిలుపులకు స్పందించని విద్యార్థులు.. కాక్రోచ్‌ జనతా పార్టీ పిలుపుతో ఎందుకు పోటెత్తారు?

ఏడాదిగా దిక్కుమొక్కు లేని 18,500 కోట్ల శ్రీశైలం ఘాట్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రతిపాదన

ఏడాదిగా దిక్కుమొక్కు లేని 18,500 కోట్ల శ్రీశైలం ఘాట్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రతిపాదన

శ్రీశైలం వెళ్లాలంటే ప్రస్తుతం ఘాట్‌ రోడ్డు ఒకటే మార్గం. అందులో అనేక మలుపులు, ఎత్తుపల్లాలు ఉంటాయి. నల్లమల అరణ్యంలో నుంచి వెళుతున్న కారణంగా.. ఆ రోడ్డుపై రాత్రిళ్లు ప్రయాణాలు నిషిద్ధం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏపీ, తెలంగాణలను కలుపుతూ శ్రీశైలం మీదుగా ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. కానీ.. ఇప్పటికీ ఈ విషయంలో ఎలాంటి జీవో విడుదల కాకపోవడంతో ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందనే చర్చలు సాగుతున్నది.

హిట్లర్‌ నుంచి స్ఫూర్తి పొంది.. హైడ్రా ఏర్పాటు.. సీఎం రేవంత్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

ది హిందూ హడిల్‌లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రూలర్ కాదని, ప్రజాసేవకుడినని పేర్కొంటూ ఉద్యోగాలు, రైతులు, మహిళల అభివృద్ధిపై వివరించారు. తాను హిట్లర్‌ నుంచి స్ఫూర్తి పొంది హైడ్రాను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.

మా పిల్లలంతా ప్రభుత్వ పాఠశాలలకే..బాబాపూర్ గ్రామస్తుల తీర్మానం

నిర్మల్ జిల్లా బాబాపూర్ గ్రామస్తులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలకే పంపాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్

టీమిండియా టీ20 జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యగా, వైభవ్ సూర్యవంశీకి తొలి అవకాశం లభించింది.