విధాత, ఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోకి మరికొంతమంది సీనియర్లకు చోటుదక్కింది. కుమారి సెల్జ, అభిషేక్ మను సంఘ్వీలకు సీడబ్ల్యూసీ సభ్యులుగా అవకాశం ఇచ్చింది. శాశ్వత ఆహ్వానితుడిగా టీ.సుబ్బిరామిరెడ్డికి అవకాశం దక్కింది.
ప్రత్యేక ఆహ్వానితుడిగా అజయ్ కుమార్ లల్లూని నియమిస్తూ ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదం తెలపడంతో పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకనట విడుదల చేశారు.