HomeLatest newsమెరుగైన వైద్య సేవల్లో ఎయిమ్స్ ముందంజ: గవర్నర్ తమిళి సై

మెరుగైన వైద్య సేవల్లో ఎయిమ్స్ ముందంజ: గవర్నర్ తమిళి సై

విధాత, యాదాద్రి భువనగిరి: గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎయిమ్స్ వైద్య సంస్థలు దేశంలోనే ముందంజలో ఉన్నాయని రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ అన్నారు. మంగళవారం ఆమె బీబీనగర్ మండలంలోని ఎయిమ్స్ వైద్య శాలను సందర్శించారు.

ఈ సందర్బంగా ఎయిమ్స్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎయిమ్స్ వైద్య శాలను పరిశీలించడం చాలా సంతోషంగా ఉందని, దశాఖాన వారు ఆహ్వానించగా నా బాధ్యతగా ఇక్కడికి వచ్చాన్నారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించడంలో అందులో బీబీనగర్ ఎయిమ్స్ మొదటి స్థానంలో ఉందన్నారు.

సర్జరీలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకుండా నార్మల్ డెలివరీలు ఎక్కువ చేయడం, కొవిడ్ సమయంలో వ్యాక్సినేషనఖకు ప్రాముఖ్యత ఇచ్చి ఆ కార్యక్రమాన్ని అందరి సహకారంతో విజయవంతం చేశారని గవర్నర్ అన్నారు. ఈ సందర్భంగా ఎయిమ్స్‌లో ఏర్పాటు చేసిన స్కిల్ ల్యాబ్‌ను గవర్నర్ ప్రారంభించారు.

అదేవిధంగా ఎయిమ్స్ వైద్యశాల రూపొందించిన 233 పేజీలు ఉన్న రిలీజింగ్ ఇనిస్టిట్యూట్ రీసర్చ్ మ్యాగ్జిన్‌ను, ఆపరేషన్ స్వస్త్య ది సర్జికల్ జర్నీ, అనుసంధాన్ అనే రెండు పుస్తకాలను గవర్నర్ ఆవిష్కరించారు. .

అనంతరం ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ బాటియా మాట్లాడుతూ ఎయిమ్స్ వైద్యశాల అన్ని రకాల వైద్య సదుపాయాలతో ముందు ఉందని, వైద్య శాలకు అవసరమున్న అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ను తెప్పిస్తున్నట్లు ఇక ముందు కూడా గవర్నర్ గారు సహాయ సహకారాలు అందించాలని కోరారు.

అనంతరం గవర్నర్ ఎయిమ్స్ వైద్యశాలలో మొక్కలు నాటి వైద్యశాలలోని కొన్ని గదులని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, డీసీపీ నారాయణ రెడ్డి, ఎయిమ్స్ PRO శ్యామల, ఎయిమ్స్ వైద్య విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

తాజా వార్త‌లు

error: Content is protected !!