HomeLatest newsత‌ల్లి కాబోతున్న ఆలియా భట్

త‌ల్లి కాబోతున్న ఆలియా భట్

విధాత: బాలీవుడ్ ప్రముఖ నటులు రబీ బీర్ కపూర్, ఆలియా భట్ తమ ప్రేమ బంధాన్ని ఇటీవల పెళ్లిగా మార్చుకున్న సంగతి తెలిసిన విషయమే. వివాహం చేసుకున్న తర్వాత కూడా ఆలియాభట్ వరుసగా సినిమాల్లో నటిస్తోంది.

తాజాగా ఆమె ఓ చిత్రాన్ని ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసి ఆమె ‘మా బేబీ త్వరలో ఈ భూమ్మీదకు రానుంది’ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చాత్రంలో ఆలియా ఆస్పత్రిలోని బెడ్‌పై పడుకుని ఉండగా.. పక్కన టీవీ మానిటర్లో లవ్ సింబల్ కనిపిస్తోంది.

పక్కనే భర్త రణబీర్ కూడా ఉన్నాడు. వీరిద్ద‌రు పెద్దల సమక్షంలో ఏప్రిల్ 14న మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆలియా చెప్పిన శుభవార్తతో.. భట్, కపూర్ కుటుంబాల్లో ఆనందం నెలకొంది. ప్రస్తుతం వీరిద్దరూ బ్రహ్మాస్త్ర చిత్రంలో కలిసి నటిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt)

ఇక ఆలియా భట్ సినిమాల విషయానికి వస్తే.. ఆమె తన తండ్రి మహేష్ భట్ వారసత్వంగా సినిమాల్లోకి వచ్చింది. కేవలం వారసురాలు అనే ముద్రతో కాకుండా తనదైన నటనతో ఆలియా భట్ ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఆమె నటించిన మొదటి సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’. ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది.

అనంతరం డియర్ జిందగీ, హైవే, రాజీ లాంటి సినిమాలు కూడా ఆలియా భట్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇటీవల ఆమె నటించిన ఆర్.ఆర్.ఆర్, గంగూబాయి కతియావాడి సినిమాలు కూడా ఘనవిజయం సాధించాయి. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో చిన్న పాత్రే అయినా ఆ పాత్రకు ఆలియా నిండుదనం తెచ్చిపెట్టింది. ఇక గంగూబాయి కతియావాడి మూవీలో వేశ్యగా నటించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.

RELATED ARTICLES

తాజా వార్త‌లు

error: Content is protected !!