ప్రారంభంలో క్రియేటివ్ ద‌ర్శ‌కుడిగా పేరు సంపాదించుకున్న రామ్‌గోపాల్‌వ‌ర్మ ఆ త‌ర్వాత సంచ‌ల‌న ద‌ర్శ‌కుడిగా మారారు. ప్ర‌స్తుతం వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడిగా కొన‌సాగుతున్నారు. భ‌విష్య‌త్తులో ఏ ద‌ర్శ‌కుడిగా కొన‌సాగుతార‌నేది పూర్తిగా తెలియ‌దు. ఆయ‌న చేసే వ్యాఖ్య‌లు వివాదాల‌కు కేంద్ర బిందువుగా మార‌తాయి. 2019 ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ జీవితంలోని లక్ష్మీపార్వతి ఎపిసోడ్ ను సినిమాగా తీసి రాజకీయాలను వేడెక్కించిన వ‌ర్మ‌ అంతకు ముందు `వంగవీటి` పేరుతో బెజ‌వాడ రాజ‌కీయాల‌ను తెర‌కెక్కించారు. జ‌గ‌న్ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన‌ప్పుడు క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌రెడ్లు పేరుతో […]

ప్రారంభంలో క్రియేటివ్ ద‌ర్శ‌కుడిగా పేరు సంపాదించుకున్న రామ్‌గోపాల్‌వ‌ర్మ ఆ త‌ర్వాత సంచ‌ల‌న ద‌ర్శ‌కుడిగా మారారు. ప్ర‌స్తుతం వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడిగా కొన‌సాగుతున్నారు. భ‌విష్య‌త్తులో ఏ ద‌ర్శ‌కుడిగా కొన‌సాగుతార‌నేది పూర్తిగా తెలియ‌దు. ఆయ‌న చేసే వ్యాఖ్య‌లు వివాదాల‌కు కేంద్ర బిందువుగా మార‌తాయి. 2019 ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ జీవితంలోని లక్ష్మీపార్వతి ఎపిసోడ్ ను సినిమాగా తీసి రాజకీయాలను వేడెక్కించిన వ‌ర్మ‌ అంతకు ముందు 'వంగవీటి' పేరుతో బెజ‌వాడ రాజ‌కీయాల‌ను తెర‌కెక్కించారు. జ‌గ‌న్ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన‌ప్పుడు క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌రెడ్లు పేరుతో సినిమా తీశారు. ఆ టైటిల్ వివాదాస్ప‌దం కావ‌డంతో అమ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌బిడ్డ‌లు అని పేరు పెట్టారు.

జ‌గ‌న్ కేంద్రంగా సినిమా
రెండేళ్ల విరామం తర్వాత వివాదాస్ప ద సినిమాను తీస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. అది కూడా ఏపీ సీఎం జగన్ కేంద్రంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు 'జగమొండి' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన క‌డ‌ప జిల్లా మునిసిపల్ ఎన్నికల్లో చైర్మన్ అయిన ఓ నాయకుడి కుమారుడు ఈ సినిమాకు నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.

జ‌గ‌న్ జైలు జీవిత‌మే ముఖ్యం
రామ్‌గోపాల్‌వ‌ర్మ‌తో స‌ద‌రు నిర్మాత ఇప్ప‌టికే ఇప్పటికే 'డి'-కంపెనీ అనే సినిమా తీస్తున్నారు. మళ్లీ ఆయనే ఇప్పుడు ఆర్జీవీతో కలిసి జ‌గ‌న్‌మీద సినిమా తీయ‌డానికి సిద్ధ‌మ‌య్యార‌ని స‌మాచారం. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. జగన్ ఎంత మొండి వాడో ఈ చిత్రంలో చూపించనున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా తన పదవి కోసం కాంగ్రెస్ పార్టీతో విభేదించి బ‌య‌ట‌కు రావ‌డం.. ఆ త‌ర్వాత చోటుచేసుకున్న ప‌రిణామాలు.. పార్టీ స్థాప‌న‌.. జైలుకెళ్ల‌డం.. ష‌ర్మిల ప్ర‌చారం.. బెయిల్‌పై జ‌గ‌న్ రావ‌డం.. ఓదార్పు యాత్ర‌.. పార్టీ పెట్ట‌డం.. ముఖ్య‌మంత్రి కావ‌డంలాంటి ప‌రిణామాల‌న్నీ ఈ సినిమాలో ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జ‌గ‌న్ జైలు జీవితంపై ఈ సినిమా క‌థ న‌డ‌వ‌నున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. సినిమా ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతుంది? న‌టీన‌టులెవ‌రు? త‌దిత‌ర విష‌యాల‌న్నీ త్వ‌ర‌లోనే బ‌య‌‌ట‌కు రానున్నాయి.

Updated On 13 April 2021 2:02 PM GMT
subbareddy

subbareddy

Next Story