ఈరోజు పలాస కాశీబుగ్గ మున్సిపల్ కార్యాలయంలో రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ డిప్యూటీ అధికారి డాక్టర్ లీలా, పలాస నియోజకవర్గ పరిధిలోని పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాల ఎంపీడీఓ లు, ఎమ్మార్వోలు, మున్సిపల్ కమిషనర్, పోలీస్ అధికారులతో కలిసి పలాస నియోజకవర్గంలో ప్రస్తుత కోవిడ్ పరిస్థితులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా సెకండ్ వేవ్ కు సంబంధించి నేటి వరకు నియోజకవర్గంలో లక్షణాలున్న 3755 మందికి వైద్య పరీక్షలు జరపగా […]

ఈరోజు పలాస కాశీబుగ్గ మున్సిపల్ కార్యాలయంలో రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ డిప్యూటీ అధికారి డాక్టర్ లీలా, పలాస నియోజకవర్గ పరిధిలోని పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాల ఎంపీడీఓ లు, ఎమ్మార్వోలు, మున్సిపల్ కమిషనర్, పోలీస్ అధికారులతో కలిసి పలాస నియోజకవర్గంలో ప్రస్తుత కోవిడ్ పరిస్థితులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా సెకండ్ వేవ్ కు సంబంధించి నేటి వరకు నియోజకవర్గంలో లక్షణాలున్న 3755 మందికి వైద్య పరీక్షలు జరపగా 359 మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది, అందులో 55 మంది శ్రీకాకుళం రిమ్స్, జెమ్స్ హాస్పిటల్లల్లో వైధం పొందుతుండగా, 14 మంది విశాఖపట్నంలోని ప్రైవేటు వైద్యశాలలలో చికిత్స పొందుతున్నారు, మిగతా వారు హోమ్ ఐసోలేషన్ లో ఉండగా మొత్తంగా నేటికి 198 మంది కొలుకున్నారని వైద్య అధికారులు తెలియజేసారు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారందరినీ నిర్దారణ చేసి వైద్య పరీక్షలు చేస్తున్నామని అన్నారు, హోమ్ ఐసోలేషన్లో ఉన్న వారికి ప్రతి రోజు ఉదయం సాయంత్రం సచివాలయ సిబ్బంది మరియు వైద్య అధికారులు వారిని కలిసి క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నామని అధికారు మంత్రి దృష్టికి తీసుకొని వచ్చారు. గ్రామాలలో ప్రజలు కాశీబుగ్గ పట్టణానికి రాకుండా నియంత్రించాలని, వారికి అన్ని రకాల నిత్యావసర సరుకులు గ్రామాలు, మండలాల పరిధిలో అందుబాటులో ఉండే విధంగా మరియు ప్రజలందరూ మస్కులు కచ్చితంగా ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రివర్యులు సూచించారు.

వజ్రపుకొత్తూరు మండలానికి సంబంధించి వజ్రపుకొత్తూరులో మరియు పలాస మండలానికి సంబంధించి బ్రహ్మణతర్ల లో నూతనంగా మార్కెట్లు ఏర్పాటు చేసి నిత్యావసరాలు అందుబాటులోకి తీసుకురావాలని, తద్వారా కాశీబుగ్గ పట్టణానికి గ్రామలనుండి ప్రజలు రాకుండా నివారించవచ్చని అన్నారు. కాశీబుగ్గలో ప్రతి శుక్రవారం నిర్వహించే సంత కోవిడ్ దృశ్యా తాత్కాలికంగా కొద్దిరోజులు ఆపుతున్నామని దీనిని సంత నిర్వహించే చిరు వ్యాపారులు సానుకూలంగా తీసుకోవాలని అన్నారు. కోవిడ్ టెస్ట్ కిట్లు కొరత ఉందని వాటి సామర్ధ్యాన్ని పెంచాలని వైద్యాధికారులు మంత్రివర్యులను కోరగా ఆయన స్పందించి కలెక్టర్ గారితో సంప్రదించి టెస్ట్ కిట్లు అధికంగా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని మంత్రివర్యులు సూచించారు, రేపటి నుండి 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిందని, 10వ తరగతి పిల్లలకు మాత్రం యధావిధిగా తరగతులు నిర్వహిస్తారని అయితే అధికారులు స్కూళ్లకు కూడా వెళ్లి విద్యార్థులు, ఉపాధ్యాయులు కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అన్న విషయాన్ని పరిశీలన చేయాలని అన్నారు. సినిమా థియేటర్లలో జనసమూహం ఎక్కువగా ఉంటున్న కారణంగా థియేటర్లలో ఉన్న సామర్ధ్యానికి 50 శాతం మందిని మాత్రమే అనుమతించేలా ప్రతి సీటు కి సీటు కి మధ్య కాళీ ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఒకే చోట కాయగూరలు, నిత్యావసరాల మార్కెట్లు నిర్వహిస్తుండడం వలన ప్రజలు గుంపులుగా చేరుతున్నారని దీనిద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున, చిరువ్యాపారులందరికీ రోడ్లపైన ఒక్కొక్కరికీ ఒక్కో చోట స్థలం కేటాయించడం జరుగుతుందని, చిరువ్యాపారులందరు వారికి కేటాయించిన స్థలాలలోనే వారి విక్రయాలు జరపాలని అన్నారు. ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించాలని, మస్కులు, సానిటైజర్లు కచ్చితంగా వాడాలని, అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరు బయటకి రావద్దని, ప్రస్తుత పరిస్థితులలో స్వీయ నియంత్రణ మాత్రమే శ్రీరామ రక్ష అని మంత్రివర్యులు విజ్ఞప్తి చేసారు.

Updated On 20 April 2021 4:17 AM GMT
subbareddy

subbareddy

Next Story