ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి ఉపఎన్నిక ప్రచార సభ రద్దు అయ్యింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా సభకు రాలేకపోతున్నానని సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు తిరుపతి ప్రజలకు సీఎం వైఎస్ జగన్ బహిరంగ లేఖ రాశారు. ‘‘నిన్న ఒక్కరోజే 2,765 కరోనా కేసులు వచ్చాయి. చిత్తూరులో 496, నెల్లూరులో 296 కేసులు వచ్చాయి. 24 గంటల వ్యవధిలో ఈ రెండు జిల్లాల్లో కరోనాతో నలుగురు మృతి చెందారు. తిరుపతి సభకు నేను హజరైతే వేలాదిగా జనం […]

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి ఉపఎన్నిక ప్రచార సభ రద్దు అయ్యింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా సభకు రాలేకపోతున్నానని సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు తిరుపతి ప్రజలకు సీఎం వైఎస్ జగన్ బహిరంగ లేఖ రాశారు.

‘‘నిన్న ఒక్కరోజే 2,765 కరోనా కేసులు వచ్చాయి. చిత్తూరులో 496, నెల్లూరులో 296 కేసులు వచ్చాయి. 24 గంటల వ్యవధిలో ఈ రెండు జిల్లాల్లో కరోనాతో నలుగురు మృతి చెందారు. తిరుపతి సభకు నేను హజరైతే వేలాదిగా జనం తరలివస్తారు. ప్రజల ఆరోగ్యం, ఆనందం నాకు ముఖ్యం. బాధ్యత కలిగిన సీఎంగా తిరుపతి సభ రద్దు చేసుకుంటున్నా. ప్రతి కుటుంబానికి కలిగిన లబ్ధికి సంబంధించిన వివరాలతో.. నా సంతకంతో ఇంటింటికి అందేలా ఉత్తరం రాశా.

Updated On 10 April 2021 11:25 AM GMT
subbareddy

subbareddy

Next Story