తెలంగాణలో రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 30కి.మీ. నుంచి 40కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఈ రోజు ఉత్తర-తూర్పు ఉపరితల ఆవర్తనం దక్షిణ తమిళనాడు నుంచి ఇంటీరియర్‌ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 1.5కి.మీ. ఎత్తులో ఏర్పడిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు ఉత్తర కోస్తాంధ్రలో వచ్చే మూడు రోజులు మోస్తరు వర్షాలు కురిసే […]

తెలంగాణలో రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 30కి.మీ. నుంచి 40కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఈ రోజు ఉత్తర-తూర్పు ఉపరితల ఆవర్తనం దక్షిణ తమిళనాడు నుంచి ఇంటీరియర్‌ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 1.5కి.మీ. ఎత్తులో ఏర్పడిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు ఉత్తర కోస్తాంధ్రలో వచ్చే మూడు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వాతావరణ కేంద్రం ప్రకటించింది. అలాగే రాయలసీమలోనూ ఒకట్రెండు చోట్ల వర్షాల పడతాయని తెలిపింది.

Updated On 22 April 2021 5:01 AM GMT
subbareddy

subbareddy

Next Story