ఏపీలోని విశాఖ హార్బ‌ర్‌లో సుమారు 40 బోట్లు బుగ్గి అయ్యాయి. ఆదివారం రాత్రి కొంద‌రు అగంత‌కులు పార్టీ చేసుకొని ఫిషింగ్ బోట్ల‌కు నిప్పు పెట్టిన‌ట్టుగా పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

  • జాల‌ర్ల‌కు రూ.6 కోట్ల వ‌ర‌కు న‌ష్టం
  • ఘ‌ట‌న‌పై ఏపీ సీఎం జ‌గ‌న్ దిగ్భ్రాంతి

విధాత‌: ఏపీలోని విశాఖ హార్బ‌ర్‌లో సుమారు 40 బోట్లు బుగ్గి అయ్యాయి. ఆదివారం రాత్రి కొంద‌రు అగంత‌కులు పార్టీ చేసుకొని ఫిషింగ్ బోట్ల‌కు నిప్పు పెట్టిన‌ట్టుగా పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. చేప‌ల వేటకు వెళ్లే బోట్లు బుడిద‌గా మార‌డంతో మ‌త్స్య‌కార కుటుంబాలు రోడ్డున ప‌డ్డాయి. ఒక్కో బోటు విలువ రూ.15 ల‌క్ష‌ల కావ‌డంతో రూ.6 కోట్ల వ‌ర‌కు న‌ష్టం వాటిల్లింద‌ని పోలీసులు అనుమానం వ్య‌క్తంచేశారు.

స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకొని మంట‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చారు. విశాఖప‌ట్ట‌ణం పోలీస్ క‌మిష‌న‌ర్ ర‌విశంక‌ర్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మంటలు ఇతర బోట్ల‌కు వ్యాపించకుండా పడ‌వ‌ల లింకును క‌త్తించారు. కానీ, గాలులు, నీటి ప్రవాహానికి ప‌డవ‌లు తిరిగి ఒడ్డుకు కొట్టుకురావ‌డంతో మంట‌లు వ్యాపించి ఇతర పడవలు కూడా కాలిపోయాయి.

పడవ‌ల్లోని డీజిల్ కంటైనర్లు, గ్యాస్ సిలిండర్లు మంటలకు ఆజ్యం పోశాయి. కొన్ని బోట్ల‌లో గ్యాస్ సిలిండర్లు పేలి ప్ర‌మాద తీవ్ర‌తను మ‌రింత పెంచాయి. జెట్టీ ప్రాంతం మొత్తం మంటలు వ్యాపించ‌డంతో ప్ర‌మాద తీవ్ర‌త పెరిగింది. ఆదివారం రాత్రి కొంద‌రు అగంత‌కులు పార్టీ చేసుకొని బోటుకు నిప్పు పెట్ట‌డం ద్వారా ఇత‌ర బోట్ల‌కు మంట‌లు వ్యాపించిన‌ట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇంత వ‌ర‌కు మ‌నుషులు ఎవ‌రూ గాయ‌ప‌డిన‌ట్టుగానీ, చ‌నిపోయిన‌ట్టుగానీ స‌మాచారం అంద‌లేద‌ని పోలీసులు వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు. బోట్లు బుడిదైన ఘ‌ట‌న‌పై ఏపీ సీఎం జ‌గ‌న్ దిగ్ర్బాంతి వ్య‌క్తంచేశారు. బోట్లు కాలిపోయిన మ‌త్స‌కారుల‌ను ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌ని భ‌రోసా ఇచ్చారు. ఈ ఘ‌ట‌న‌కు కార‌ణమైన నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు.

Updated On
Somu

Somu

Next Story