విధాత:ఆరోగ్య స్వయం సేవకులతో కరపత్రాల ద్వారా ప్రచారం చేయడం ద్వారా గ్రామాల్లో ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటున్నాం, ఒకవేళ థర్డ్ వేవ్ వస్తే సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు కార్యకర్తలను సిద్ధం చేస్తున్నాం.గ్రామానికి ఇద్దరు చొప్పున దేశవ్యాప్తంగా నాలుగులక్షల మందికి శిక్షణ ఇస్తున్నాం.రాష్ట్ర,జిల్లా స్థాయిల్లో ఇప్పటికే శిక్షణా కార్యక్రమాలు పూర్తిచేసుకుని, అసెంబ్లీ స్థాయిల్లో శిక్షణా కార్యక్రమాలు ప్రారంభించాము. ఈనెల మొదటి వారానికి 175 నియోజకవర్గాల్లో శిక్షణ పూర్తి చేస్తాం.25లక్షల కరపత్రాలతో ప్రచారం చేసి కరోనా మూడో వేవ్ వస్తే తట్టుకునే విధంగా […]

విధాత:ఆరోగ్య స్వయం సేవకులతో కరపత్రాల ద్వారా ప్రచారం చేయడం ద్వారా గ్రామాల్లో ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటున్నాం, ఒకవేళ థర్డ్ వేవ్ వస్తే సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు కార్యకర్తలను సిద్ధం చేస్తున్నాం.గ్రామానికి ఇద్దరు చొప్పున దేశవ్యాప్తంగా నాలుగులక్షల మందికి శిక్షణ ఇస్తున్నాం.రాష్ట్ర,జిల్లా స్థాయిల్లో ఇప్పటికే శిక్షణా కార్యక్రమాలు పూర్తిచేసుకుని, అసెంబ్లీ స్థాయిల్లో శిక్షణా కార్యక్రమాలు ప్రారంభించాము. ఈనెల మొదటి వారానికి 175 నియోజకవర్గాల్లో శిక్షణ పూర్తి చేస్తాం.25లక్షల కరపత్రాలతో ప్రచారం చేసి కరోనా మూడో వేవ్ వస్తే తట్టుకునే విధంగా ఆరోగ్య శిక్షణ పూర్తి చేసి, ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం.ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన విస్తారక్ యోజనలో భాగంగా 900 పైగా పార్టీ సంస్థాగత మండలాల్లో కార్యక్రమాలు నిర్వహించాం,లక్ష్యసాధన దిశగా రాష్ట్రంలో పార్టీ యంత్రాంగాన్ని క్షేత్రస్థాయిలోపటిస్టం చేస్తున్నాం. తెలుగు భాష పరిరక్షణ కోసం ఒక రాజకీయ పార్టీ గా బాధ్యత తీసుకున్నాం,వారోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం తెలుగు కళాకృత్తుల ప్రదర్శన, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నాం.

రాష్ట్ర పార్టీ కార్యాలయంలో గ్రంధాలయాన్ని ప్రారంభించాం, అన్ని జిల్లాల్లో ఇప్పటికే వున్న,త్వరలో నిర్వహించనున్న శాశ్వత భవనాలు నిర్మించి, గ్రంధాలయాలు ఏర్పాటు చేస్తున్నాం.ప్రతి జిల్లాలో కార్యాలయాలు ఏర్పాటు, జమాఖర్చులు ఆడిట్ వంటి వాటి పై శిక్షణ నిర్వహిస్తున్నాం పారదర్శకంగా ఆర్ధిక వ్యవహారాలు జరిపి ఆదర్శంగా ఉండేలా చూస్తున్నాం.

Updated On 1 Sep 2021 12:14 PM GMT
subbareddy

subbareddy

Next Story