అల‌నాటి సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని విజ‌య‌వాడ‌లో ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ శుక్రవారం ఆవిష్కరించారు.

విజ‌య‌వాడ : అల‌నాటి సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని విజ‌య‌వాడ‌లో శుక్ర‌వారం ఆవిష్క‌రించారు. స్థానిక గురునానక్ కాలనీలోని కేడి జీవో పార్క్ లో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ శుక్రవారం ఉదయం ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార పార్టీ నేత దేవినేని అవినాష్ తో పాటు పెద్ద ఎత్తున కృష్ణ, మహేష్ అభిమానులు పాల్గొన్నారు. ఇండియన్- 2 సినిమా చిత్రీకరణ కోసం కమల్ హాసన్ విజయవాడ వచ్చారు. దీనిలో భాగంగానే ఆయన కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.

Updated On
Somu

Somu

Next Story