విధాత:ఐఎండి సూచనల ప్రకారం పశ్చిమమధ్య మరియు వాయువ్య బంగాళాఖాతంఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరప్రాంతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం.దీని ప్రభావంతో రేపు మోస్తారు వర్షాలు,ఆదివారం, సోమవారం అక్కడక్కడ భారీ వర్షాలు సూచన వుందని తీరం వెంబడి గంటకు 50-60 కీ.మీ వెగంతో గాలులుసముద్రం అలజడిగా ఉంటుందని కావునా మత్స్యకారులు మంగళవారం వరకు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని విపత్తుల శాఖ కమిషనర్కె.కన్నబాబు అన్నారు. రాగల మూడు రోజుల వాతావరణ వివరాలు : జూలై 10 శనివారం :- ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి […]
విధాత:ఐఎండి సూచనల ప్రకారం పశ్చిమమధ్య మరియు వాయువ్య బంగాళాఖాతం
ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరప్రాంతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం.దీని ప్రభావంతో రేపు మోస్తారు వర్షాలు,ఆదివారం, సోమవారం అక్కడక్కడ భారీ వర్షాలు సూచన వుందని తీరం వెంబడి గంటకు 50-60 కీ.మీ వెగంతో గాలులు
సముద్రం అలజడిగా ఉంటుందని కావునా మత్స్యకారులు మంగళవారం వరకు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని విపత్తుల శాఖ కమిషనర్కె.కన్నబాబు అన్నారు.
రాగల మూడు రోజుల వాతావరణ వివరాలు :
జూలై 10 శనివారం :- ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు
మిగిలినచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం
జూలై 11 ఆదివారం :- కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు,
రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు
మిగిలినచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం
జూలై 12 సోమవారం :- రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ భారీ వర్షాలు
మిగిలినచోట్ల మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశం వుందని కావునా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.