విధాత‌: చంద్రబాబు రైతు వ్యతిరేకి. వ్యవసాయం దండగ అని, రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తే, విద్యుత్‌ తీగలపై బట్టలు ఆరేసుకోవాలన్నాడు.చంద్రబాబుకు ఏనాడూ ప్రజల సంక్షేమం పట్టదు. ఎంతసేపూ స్వార్థ రాజకీయాలు తప్ప. విద్యుత్‌ ఛార్జీలపై ఉద్యమించిన రైతులపై కాల్పులు జరిపి, ముగ్గురిని పొట్టన పెట్టుకున్నాడు. బషీర్‌బాగ్‌ కాల్పులు జరిగి సరిగ్గా (28వ తేదీ శనివారం) 21 ఏళ్లు పూర్తవుతాయి.తొలి నుంచి చంద్రబాబు రైతు వ్యతిరేకిగా, ప్రజా వ్యతిరేకిగా ఆలోచనలు చేస్తున్నారు తప్ప, ప్రజలకు మేలు జరుగుతుంటే సంతోషపడిన […]

విధాత‌: చంద్రబాబు రైతు వ్యతిరేకి. వ్యవసాయం దండగ అని, రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తే, విద్యుత్‌ తీగలపై బట్టలు ఆరేసుకోవాలన్నాడు.చంద్రబాబుకు ఏనాడూ ప్రజల సంక్షేమం పట్టదు. ఎంతసేపూ స్వార్థ రాజకీయాలు తప్ప. విద్యుత్‌ ఛార్జీలపై ఉద్యమించిన రైతులపై కాల్పులు జరిపి, ముగ్గురిని పొట్టన పెట్టుకున్నాడు. బషీర్‌బాగ్‌ కాల్పులు జరిగి సరిగ్గా (28వ తేదీ శనివారం) 21 ఏళ్లు పూర్తవుతాయి.తొలి నుంచి చంద్రబాబు రైతు వ్యతిరేకిగా, ప్రజా వ్యతిరేకిగా ఆలోచనలు చేస్తున్నారు తప్ప, ప్రజలకు మేలు జరుగుతుంటే సంతోషపడిన దాఖలా లేదు. బషీర్‌బాగ్‌ కాల్పులను ఈనాటికి ప్రజలు మర్చిపోలేదన్నారు ఎమ్మెల్యే కె.పార్థసారథి.

సీఎం వైయస్‌ జగన్‌ చేతిలో ఎన్నికల్లో చావుదెబ్బ తిన్నాక, చంద్రబాబుకు మతి భ్రమించి ఒక ఉన్మాదిలా మారారు. ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పథకాలను ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటుంటే, మేధావులు కూడా ప్రశంసిస్తుంటే.. వాటిని ఏ విధంగా అడ్డుకోవాలి. ఏ విధంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలి. ప్రజలకు ఏ విధంగా మేలు జరగకుండా చూడాలి అని ఆలోచన చేస్తున్న నీచుడు చంద్రబాబు. రాజకీయాలలో ఇంత నీచమైన మనస్తత్వం ఉన్న వారు ఎవరూ ఉండరని నేను భావిస్తున్నాను.

14 ఏళ్లు సీఎంగా ఉన్నానని గొప్పలు చెప్పుకునే వ్యక్తి, రాష్ట్రంలో ప్రజలకు ఇంత మేలు జరుగుతుంటే చూసి ఓర్వలేక తన టక్కు టమార విద్యలతో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాడు. తన లాయర్లు, తన పచ్చ పత్రికలతో ఈ ప్రభుత్వం మీద.. ఈ మంచి కార్యక్రమాలను ఆపండి అని కోర్టుల్లో కేసులు వేయించే దుస్థితి, దౌర్భాగ్యానికి చంద్రబాబునాయుడు దిగజారడం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలకు శాపంలా మారింది.

చంద్రబాబునాయుడు ఓడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను గాలికి ఒదిలేసి పారిపోయి హైదరాబాద్‌లో దాక్కుంటున్నాడు.అధికారంలో ఉన్నప్పుడేమో.. హైదరాబాద్‌ రాజధానిగా 10 ఏళ్లు అవకాశం ఉన్నప్పటికీ, ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి, తను చేసిన పాపాలకు రాత్రికి రాత్రి పారిపోయి వచ్చి ఇక్కడ, ఏదో పొడిచేస్తానని చెప్పి ఇక్క బస్సులో కూర్చుని నాటకాలాడాడు.ఓడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో నాకు సంబంధం లేదు. ఈ రాష్ట్ర ప్రజలతో నాకు సంబంధం లేదని చెప్పి అక్కడికి పారిపోయి, అక్కడ దాక్కుని వీడియా కాన్ఫరెన్పుల్లో, జూమ్‌ కాన్ఫరెన్సుల్లో మాట్లాడుతూ కాలం గడుపుతున్నాడని విమ‌ర్శించారు.

Updated On 28 Aug 2021 6:37 AM GMT
subbareddy

subbareddy

Next Story