విధాత‌: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో నూతనంగా తీసుకొచ్చిన సంస్కరణలను కఠినంగా అమలు చేయాలని డిప్యూటీ సీఎం రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శాఖాపరమైన సమీక్షల కోసం శ్రీకాకుళం జిల్లాలో పర్యటనకు వచ్చిన స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజి) ఎంవి శేషగిరిబాబు, డిప్యూటీ సీఎం, రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ను వారి నివాసంలో శనివారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శేషగిరిబాబుతో మొక్కను నాటించారు. అనంతరం జరిగిన […]

విధాత‌: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో నూతనంగా తీసుకొచ్చిన సంస్కరణలను కఠినంగా అమలు చేయాలని డిప్యూటీ సీఎం రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శాఖాపరమైన సమీక్షల కోసం శ్రీకాకుళం జిల్లాలో పర్యటనకు వచ్చిన స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజి) ఎంవి శేషగిరిబాబు, డిప్యూటీ సీఎం, రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ను వారి నివాసంలో శనివారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శేషగిరిబాబుతో మొక్కను నాటించారు. అనంతరం జరిగిన సమీక్షలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ నకిలీ చలానాల కేసుల తాజా పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యాలయాలను తనిఖీ చేసి భవిష్యత్తులో పొరపాట్లకు అవకాశం లేని విధంగా సిబ్బందికి ఆదేశాలు జారీ చేయాలన్నారు. శ్రీకాకుళం జిల్లాతో పర్యటనను ప్రారంభించడం సంతోషకరమని చెప్పారు. నకిలీ చలానాల రికవరీ వేగిరం చేయాలని, దర్యాప్తును సత్వరమే పూర్తి చేసి నివేదిక అందజేయాలని కోరారు. శనివారం నుంచి పలు సబ్ రిజిస్టర్ కార్యాలయాలను ఐజి సందర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రిజిస్ట్రార్ అర్.సత్య నారాయణ, నరసన్నపేట సబ్ రిజిస్ట్రార్ బీఎస్ఎన్.రమణారావు, సిబ్బంది బాలన్న తదితరులు ఉన్నారు.

Updated On 18 Sep 2021 11:54 AM GMT
subbareddy

subbareddy

Next Story