విధాత:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ క్షణమైనా మూడు రాజధానులు ఏర్పాటు కావచ్చు, ఈ ఏడాదని కాకుండా ఏ క్షణమైనా అవుతాయని పుర‌పాల‌క మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ చెప్పారు. వీటికి సంబంధించిన పనులు ఇప్పటికే శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. మూడు రాజధానుల ఏర్పాటును కొన్ని దుష్టశక్తులు అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. శాసనసభలో ఏ చట్టం చేశామో అదే జరిగి తీరుతుందని బొత్స స్పష్టం చేశారు. మూడు రాజధానుల ఏర్పాటు తరువాత సీఎం ఎక్కడి నుంచైనా పాలన చేయవచ్చని మంత్రి బొత్స పేర్కొన్నారు. […]

విధాత:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ క్షణమైనా మూడు రాజధానులు ఏర్పాటు కావచ్చు, ఈ ఏడాదని కాకుండా ఏ క్షణమైనా అవుతాయని పుర‌పాల‌క మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ చెప్పారు. వీటికి సంబంధించిన పనులు ఇప్పటికే శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. మూడు రాజధానుల ఏర్పాటును కొన్ని దుష్టశక్తులు అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. శాసనసభలో ఏ చట్టం చేశామో అదే జరిగి తీరుతుందని బొత్స స్పష్టం చేశారు.

మూడు రాజధానుల ఏర్పాటు తరువాత సీఎం ఎక్కడి నుంచైనా పాలన చేయవచ్చని మంత్రి బొత్స పేర్కొన్నారు. అమరావతి నుంచి రాజధాని వెళ్లకూడదని టీడీపీ నేతల కోరిక అని, వాళ్లది పైశాచిక ఆనందమని బొత్స తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి బొత్స పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని పేదలందరూ వినియోగించుకోవాలని బొత్స కోరారు.

Updated On 3 Jun 2021 10:09 AM GMT
subbareddy

subbareddy

Next Story