విధాత‌: గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు మెరుగైన అదాయాన్ని అందించటంలో పశు సంపద పాత్ర ఎంతో కీలకమైనదని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో పశుపోషణ కీలక భూమికను పోషిస్తుందన్నారు. తిరుపతి వేదికగా శనివారం జరిగిన శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం 10 వ స్నాతకోత్సవంలో కులపతి హోదాలో గవర్నర్ పాల్గొన్నారు. విజయవాడ రాజ్ భవన్ నుండి వెబినార్ విధానంలో గవర్నర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా హరిచందన్ మాట్లాడుతూ భారతీయ వ్యవసాయంలో పశుపోషణ అంతర్భాగం […]

విధాత‌: గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు మెరుగైన అదాయాన్ని అందించటంలో పశు సంపద పాత్ర ఎంతో కీలకమైనదని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో పశుపోషణ కీలక భూమికను పోషిస్తుందన్నారు. తిరుపతి వేదికగా శనివారం జరిగిన శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం 10 వ స్నాతకోత్సవంలో కులపతి హోదాలో గవర్నర్ పాల్గొన్నారు. విజయవాడ రాజ్ భవన్ నుండి వెబినార్ విధానంలో గవర్నర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా హరిచందన్ మాట్లాడుతూ భారతీయ వ్యవసాయంలో పశుపోషణ అంతర్భాగం కాగా, గ్రామీణ జనాభాలో మూడింట రెండు వంతుల మంది జీవనోపాధికి పశు సంతతి కీలకంగా మారిందన్నారు.

పశు వైద్యులు సాంకేతిక, ఆర్థిక, నైతిక మద్దతును పెంపకందారులకు అందించడం ద్వారా పశు పోషణను మరింత లాభదాయకంగా మార్చేందుకు మార్గనిర్దేశం చేయవలసి ఉందన్నారు. పశువైద్యులు వృత్తిపరంగా, నైతికంగా గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న, సన్నకారు రైతుల జీవన ప్రమాణ స్దాయిని మెరుగుపరిచేందుకు కృషి చేయాలని గవర్నర్ కోరారు. కరోనా కారణంగా విద్యాభ్యాసం పలు మార్పులకు లోనవుతుండగా, డిజిటల్ క్లాస్ రూమ్ వ్యవస్ధ తెరపైకి వచ్చిందని, గరిష్ట సంఖ్యలో విద్యార్ధులు భాగస్వాములు అయ్యేలా ఈ వ్యవస్ధ రూపుదిద్దుకోవాలని గవర్నర్ ఆకాంక్షించారు. జాతీయ విద్యా విధానం 2020తో దేశ విద్యావ్యవస్ధలో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయని, హేతుబద్ధమైన ఆలోచన, ధైర్యం, స్థితిస్థాపకత, శాస్త్రీయ స్వభావం, సృజనాత్మక ఊహ, నైతిక విలువలు కీలకం కానున్నాయని ఇవి సమాజానికి మంచి పౌరులను అందిస్తాయన్న విశ్వాసం తనకుందని గవర్నర్ అన్నారు.
విజయవాడ రాజ్ భవన్ నుండి గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, గవర్నర్ వారి సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్, విశ్వవిద్యాలయ పరిశోధన విభాగపు సంచాలకులు డాక్టర్ కె సర్జన రావు, విస్తరణ విభాగ సంచాలకులు డాక్టర్ జి. వెంకట నాయిడు పాల్గొన్నారు.

Updated On 28 Aug 2021 8:04 AM GMT
subbareddy

subbareddy

Next Story