విధాత‌: కాకినాడ మేయర్ సుంకర పావనిపై అవిశ్వాస తీర్మానం, తొలగింపు విషయంలో కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యవహరించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్​పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తి చేసింది.ఈనెల 25 న న్యాయస్థానం ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఎందుకు వ్యవహరించారో చెప్పాలన్నారు. మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేతకు అనుబంధ పిటిషన్ వేస్తామని కోర్టుకు తెలిపి.. ఆ ప్రక్రియ పూర్తికాకముందే అవిశ్వాస తీర్మాన ఫలితాన్ని ప్రభుత్వానికి ఎలా పంపుతారని కలెక్టర్​పై అగ్రహం వ్యక్తం చేశారు.హైకోర్టు న్యాయమూర్తి […]

విధాత‌: కాకినాడ మేయర్ సుంకర పావనిపై అవిశ్వాస తీర్మానం, తొలగింపు విషయంలో కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యవహరించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్​పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తి చేసింది.ఈనెల 25 న న్యాయస్థానం ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఎందుకు వ్యవహరించారో చెప్పాలన్నారు.

మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేతకు అనుబంధ పిటిషన్ వేస్తామని కోర్టుకు తెలిపి.. ఆ ప్రక్రియ పూర్తికాకముందే అవిశ్వాస తీర్మాన ఫలితాన్ని ప్రభుత్వానికి ఎలా పంపుతారని కలెక్టర్​పై అగ్రహం వ్యక్తం చేశారు.హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి. రమేశ్ ఈమేరకు ఆదేశాలిచ్చారు.

Updated On 23 Oct 2021 6:31 AM GMT
subbareddy

subbareddy

Next Story