దెబ్బలు నిజమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి: హైకోర్టు బెంచ్విధాత,అమరావతి: రఘురామ కేసు స్పెషల్ మూవ్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. రఘురామరాజు కాలి దెబ్బల ఫొటోలు చూసిన హైకోర్టు డివిజనల్‌ బెంచ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఏం జరుగుతోందని ప్రశ్నించింది. దెబ్బలు నిజమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మెజిస్ట్రేట్ కోర్టులో ఏం జరిగిందో తెలుసుకుని అరగంటలో ఉత్తర్వులిస్తామని తెలిపింది. ఈ క్రమంలోనే రఘురామకు కేంద్రం కల్పించిన […]

దెబ్బలు నిజమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి: హైకోర్టు బెంచ్
విధాత,అమరావతి: రఘురామ కేసు స్పెషల్ మూవ్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. రఘురామరాజు కాలి దెబ్బల ఫొటోలు చూసిన హైకోర్టు డివిజనల్‌ బెంచ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఏం జరుగుతోందని ప్రశ్నించింది. దెబ్బలు నిజమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మెజిస్ట్రేట్ కోర్టులో ఏం జరిగిందో తెలుసుకుని అరగంటలో ఉత్తర్వులిస్తామని తెలిపింది.

ఈ క్రమంలోనే రఘురామకు కేంద్రం కల్పించిన వై కేటగిరి భద్రత కొనసాగించాలని ఆయన తరపు న్యాయవాది సీనియర్ లాయర్ ఆదినారాయణరావు కోరారు. రఘురామ కుటుంబ సభ్యులను కూడా అనుమతించాలని కోరారు. అలాగే మెడికల్ కోర్టు నివేదిక రేపు ఉదయం 10:30లోపు ఇచ్చేలా చూడాలని కోర్టును కోరారు. కాగా అంతకుముందు రఘురామ కేసుపై జస్టిస్ ప్రవీణ్‌కుమార్, జస్టిస్ లలితల ఆధ్వర్యంలో స్పెషల్ డివిజన్ బెంచ్‌ విచారణ చేపట్టింది. రఘురామ తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ ఆదినారాయణరావు వాదనలు వినింపించారు.

రఘురామను సీఐడీ పోలీసులు కొట్టారని, ఆయన నడవలేక పోతున్నారని, న్యాయవాది ఆదినారాయణరావు అంతకుముందే హైకోర్టుకు రాసిన లేఖలో తెలియజేశారు. దీనిపై మెడికల్ కోర్టు ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated On 16 May 2021 4:34 AM GMT
subbareddy

subbareddy

Next Story