విధాత : రోడ్డుపై టమాటా..పండ్ల లారీలు బోల్తా పడితేనే వదలని జనం ఇక మద్యం లోడ్‌తో వెలుతున్న లారీ బోల్తా కొడితే వదులుతారా మరి. విశాఖ నగరం పరిధిలోని మధురవాడ కమ్మాది జుంక్షన్ వద్ద శనివారం మద్యం లారీ బోల్తా పడింది. రోడ్డు పై పడిన మద్యం బాటిళ్లను దారి వెంట వెలుతున్న ప్రజలు, స్థానికులు ఎత్తుకెళ్లారు.

మద్యం లోడ్ లారీ ముందు వెలుతున్న మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో డివైడర్‌ను ఢీకొట్టి బొల్తా పడింది. ప్రమాదంలో మద్యం కాటన్‌లు, అందులోని సీసాలు రోడ్డుపైన చెల్లచెదురుగా పడిపోయాయి. ఇంకేముందు అటుగా వెలుతున్న వారంతా అందులో తమకు నచ్చిన బ్రాండ్ల మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు. మొత్తం లూటీ అయిపోకుండా అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ వారిని అదుపు చేసి మధురవాడ పోలీసులకు సమాచారం అందించారు.

Updated On
Somu

Somu

Next Story