మచిలీపట్నం : కాంట్రాక్టు స్వీపర్ల ఉద్యోగ నియామకాలు మొదలుకొని విధులలో సైతం అనవసర జోక్యం ప్రభుత్వాసుపత్రిలో కొందరు ఉద్యోగుల అవినీతి వ్యవహారాలు తన దృష్టికి వచ్చిందని వారు తమ పద్ధతి మారకపోతే తీవ్రమైన చర్యలు తప్పవని రాష్ట్ర, రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) హెచ్చరించారు. మంగళవారం ఉదయం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలుసుకున్నారు. ప్రజలు […]

మచిలీపట్నం : కాంట్రాక్టు స్వీపర్ల ఉద్యోగ నియామకాలు మొదలుకొని విధులలో సైతం అనవసర జోక్యం ప్రభుత్వాసుపత్రిలో కొందరు ఉద్యోగుల అవినీతి వ్యవహారాలు తన దృష్టికి వచ్చిందని వారు తమ పద్ధతి మారకపోతే తీవ్రమైన చర్యలు తప్పవని రాష్ట్ర, రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) హెచ్చరించారు.

మంగళవారం ఉదయం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలుసుకున్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గూర్చి అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని నాని అక్కడికక్కడే తక్షణ పరిష్కారం చూపించారు. తొలుత మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో కాంట్రాక్టు స్వీపర్లుగా పనిచేసే జన్ను లక్ష్మి, వాకా శివరంజని మంత్రిని కలుసుకొని తమ ఇబ్బందులు చెప్పుకొన్నారు. మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో 110 మంది స్వీపర్ల కు పాత కాంట్రాక్టర్ 6, 450 జీతం ఇచ్చేవారని ఇప్పుడు 16,000 గ వేతనం పెరిగిందని పి ఎఫ్ , ఇ ఎస్ ఐ మినహాయించి 12, 000 జీతం ఇస్తామని మొత్తం 95 మంది కాంట్రాక్టు స్వీపర్లను ప్రస్తుతం తీసుకొంటున్నామని ఆ ఉద్యోగాలు మీరే పంచుకోవాలని కొత్త కాంట్రాక్టర్ చెప్పారని అన్నారు. గత 22 సంవత్సరాలుగా ప్రభుత్వాసుపత్రిలో ఊడ్చేపని చేస్తున్న వారు ఎందరో వున్నారని మాకు మేము ఆ ఉద్యోగాలను పంచుకోలేమని ఆ కాంట్రాక్టర్ కు తెలియచేశామని, దాంతో ఆయనే ఒక పరిష్కారం చెప్పారని పోయిన ఏడాది కోవిడ్ కాలం నుంచి ఇప్పటి వరకు ఎవరైతే ఎక్కువ సెలవులు తీసుకున్నారో వారిని తొలగిద్దాం అని సూచించారన్నారు. దాంతో 15 మంది ఆ లెక్కలో వచ్చారని అయితే వారిలో 10 మంది గత ఇరవై రెండేళ్లుగా ఇదే వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నవారు ఉన్నారని, వారిలో కొందరికి రకరకాల ఆనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నారని తేలిందని ఒకరు వెన్నెముక ఆపరేషన్ చేయించుకొన్నవారు , జబ్బులతో ఉన్న పిల్లలతో ఇబ్బందులు పడేవారు, ఒకామెకు విధి నిర్వహణలో సిరంజి సూదులు గుచ్చుకొని ప్రాణాంతక వ్యాధులు వచ్చి ఆరోగ్యాలు పాడైనవారు వున్నారని వారందరిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు చెప్పారు. అయితే తాము మానవత్వంతో స్పందించి ఆ 15 మందిని తమ డ్యూటీ లో పంచుకొన్నామని, అయితే గత నెల 20 వ తేదీన స్వీపర్ గా విధులు నిర్వహిస్తుందని నిడుమోలు నుంచి ఇక్కడకు వచ్చిన ఒక మహిళ స్థానిక నవీన్ మిట్టల్ కాలనీలో తన సోదరి వద్ద ఉంటుందని ప్రభుత్వాసుపత్రిలో కొత్తగా వచ్చిన ఆ మహిళ నుంచి డబ్బులు తీసుకోని 15 మందితో పాటు డ్యూటీ చేయించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. కొత్తగా వచ్చిన ఆ మహిళ కన్నా నాలుగైదు రోజుల ముందు చేరిన ఆరుగురిని విధులు చేయనవసరం లేదని ఆపివేశారని, 22 ఏళ్లుగా పనిచేస్తున్నవారిని తొలగించినా, నిడుమోలు నుంచి నూతనంగా వచ్చిన మహిళను నిర్బీతిగా కొనసాగించడం పలు అనుమానాలకు తావిస్తోందని ప్రభుత్వాసుపత్రిలో ఒక ఉద్యోగి అండదండలు ఉండటం వలెనే సాధ్యమవుతుందని రిజిస్టర్లలో స్వీపర్లగా సంతకాలు పెట్టి ఆఫీస్ లలో కంప్యూటర్ల వద్ద పని చేస్తున్నారని వారు మంత్రి పేర్ని నానికి చెప్పారు.

చల్లపల్లి మండలం నడకుదురు గ్రామానికి చెందిన మామిళ్ళపల్లి పృద్వి కళ్యాణ్ మరో ముగ్గురు పురోహితులు మంత్రికి తమ సమస్య చెప్పుకొన్నారు. మచిలీపట్నం గొడుగుపేటకు చెందిన కంతేటి వెంకట హనుమంతరావు అనే వ్యక్తికి 16.50 లక్షల రూపాయల సొమ్ము ఇచ్చేమని మంత్రి పేర్ని నానికి తెలిపారు. తమతో పరిచయం పెంచుకొని పంతులు గారు..మీకు నెల నెల జీతాలు ఉండవు కదా ? కరోనా కష్ట కాలంలో గుడులకు భక్తులు రావడం లేదు కదా… మీకు నెల నెల జీతం మాదిరిగా వచ్చే ఒక ఉపాయం చెబుతానని ఆశ పుట్టించాడని నూటికి 5 రూపాయల వడ్డీ ఇస్తానని తమ వద్ద నుంచి ఒక్కొక్కరి నుంచి 4 లక్షల చొప్పున తీసుకొన్నారని మొదటి 6 నెలలు క్రమం తప్పకుండ వడ్డీ సొమ్ము ఇచ్చేరని అయితే ఇటీవల ఆయన కరోనాతో మరణించారని దీంతో తమ సొమ్ము అసలు రాక , వడ్డీ దక్కక కళ్ళ ముందే హారతి కర్పూరమైపోయిందని మీరే తమకు న్యాయం చేయాలనీ మంత్రి పేర్ని నాని వద్ద పురోహితులు వాపోయారు.

Readmore:ఒప్పంద ఉద్యోగులకు మినిమం పే స్కేల్‌

Updated On 22 Jun 2021 11:38 AM GMT
subbareddy

subbareddy

Next Story