విధాత‌:రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతోన్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీ నేతల కార్యాలయాలు, ఇళ్లపై అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు దాడి చేయడం అమానుషమైన చర్య కాదా? పట్టాభి మీడియా సమావేశం పై మీకు అభ్యంతరాలు ఉండొచ్చు, తప్పేమీ కాదు, కానీ దానికి అనుసరించాల్సిన విధానాలు ఖచ్చితంగా ఇవి మాత్రం కాదని నేను స్పష్టంగా చెప్పదలచుకున్నానన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సింది మీరే, అలాంటిది మీరే శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరికి […]

విధాత‌:రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతోన్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీ నేతల కార్యాలయాలు, ఇళ్లపై అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు దాడి చేయడం అమానుషమైన చర్య కాదా? పట్టాభి మీడియా సమావేశం పై మీకు అభ్యంతరాలు ఉండొచ్చు, తప్పేమీ కాదు, కానీ దానికి అనుసరించాల్సిన విధానాలు ఖచ్చితంగా ఇవి మాత్రం కాదని నేను స్పష్టంగా చెప్పదలచుకున్నానన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సింది మీరే, అలాంటిది మీరే శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరికి చెప్పాలి? ఆ మాత్రం కనీస విఘ్నత టీడీపీ కార్యాలయాల మీద దాడి చేయమని సలహా ఇచ్చిన వారికి తెలీదా? నిజంగా మీరు డ్రగ్స్ వ్యాపారాలు చేయకపోతే, గంజా స్మగ్లింగ్ నిర్ములనకు చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్ష నేతల విమర్శలు ఖండించండి. రాజకీయ విమర్శలను ఎదుర్కోవడం నాయకుడి సహజ లక్షణం కావాలి, కానీ ఇలా ఫ్యాక్షనిజం ని గుర్తు చేసేలా సంఘటనలు చోటు చేసుకోవడం బాధగా ఉంది.
ఇప్పటికైనా మీరు జోక్యం చేసుకుని ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తారని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.

Updated On 20 Oct 2021 7:09 AM GMT
subbareddy

subbareddy

Next Story