Wednesday, March 29, 2023
More
    HomelatestLokesh Padayatra : టిక్కెట్లు కన్ఫామ్ చేస్తున్న లోకేష్.. పాదయాత్రలోనే ఎన్నికలకు సన్నాహాలు

    Lokesh Padayatra : టిక్కెట్లు కన్ఫామ్ చేస్తున్న లోకేష్.. పాదయాత్రలోనే ఎన్నికలకు సన్నాహాలు

    లోకేష్ పాదయాత్ర (Lokesh Padayatra) ద్వారా ఎన్నికలకు రేడీ అయిపోతున్నట్లుంది. ఏడాది ముందే వేడి రగిలిస్తున్నారు. ఇదే తరుణంలో ఆయన ఏడాది ముందే అభ్యర్థులను ఖరారు చేసేస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు (chandrababu) సూచనమేరకు చేస్తున్నారో..తనంతట తానే చేస్తున్నారో గానీ లోకేష్ మాత్రం తాను బహిరంగ సభల్లో పాల్గొంటూ ఆయా నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించేస్తూ ముందుకు వెళ్తున్నారు.

    ఇప్పుడు మాట ఇస్తున్నారు..టికెట్ పేరిట పేరును ప్రకటిస్తున్నారు సరే మరి ఆ నియోజకవర్గంలో అంతకన్నా బలమైన అభ్యర్థి దొరికితే ఏమిచేస్తారు..ఇప్పుడిచ్చిన హామీని మార్చుకుంటారా..ఈయన్ను ఎలా నచ్చజెబుతారన్నది ఇంకా తెలీదు. ఇప్పటికైతే చిత్తూరు జిల్లాలో సత్యవేడు..నగరి..పలమనేరు చంద్రగిరి ..కాళహస్తి నియోజకవర్గాలకు అభ్యర్థులను లోకేష్ ప్రకటించేశారు. ఇప్పటికి ఆయన 400 కిమి యాత్ర పూర్తి చేసుకోగా 9 నియోజకవర్గాల్లో యాత్ర ముగిసి పదో నియోజకవర్గంలో కొనసాగుతోంది.

    ఇందులో ఇప్పటికే ఐదింటికి క్యాండిట్లను ఆయన బొట్టుపెట్టి ప్రజలకు పరిచయం చేసేశారు. చిత్తూరు..తిరుపతి వంటిచోట్ల టిక్కెట్ల గురించి ఏమీ మాట్లాడలేదు..ఫుల్ క్లారిటీ ఉన్నచోట మాత్రం పేర్లు వెల్లడిస్తున్నారు. మరోవైపు జగన్ ప్రభుత్వం మీద మాటలదాడి ఉధృతంగా కొనసాగిస్తున్నారు. టిడిపి పాలనలో కట్టిన..పూర్తి చేసిన..మొదలుపెట్టిన పథకాలు జగన్ తన ఖాతాలో వేసుకుంటున్నారని లోకేష్ దుయ్యబడుతున్నారు.

    ఇదిలా ఉండగా మిగతాచోట్ల సంగతి ఎలా ఉన్నా వైసిపి ఫైర్ బ్రాండ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (chevireddy bhaskar reddy)  నియోజకవర్గమైన చంద్రగిరి అభ్యర్థి విషయంలో లోకేష్ తొందర పడి వీక్ అభ్యర్థిని ప్రకటించారని అంటున్నారు. గత 2019 ఎన్నికల్లో దాదాపు 40వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన పులిపర్తి నానిని మళ్ళీ అక్కడ అభ్యర్థిగా లోకేష్ డిసైడ్ చేశారు.

    వాస్తవానికి అక్కడ గల్లా అరుణకుమారి కుటుంబం నుంచి ఒకరు పోటీ చేస్తారని, అలా అయితేనే చెవిరెడ్డిని నిలువరించే వీలు ఉండొచ్చని టిడిపి క్యాడర్ భావించినా లోకేష్ మాత్రం నాని పేరును కన్ఫామ్ చేసి క్యాడర్ ను ఉస్సూరనిపించారు అంటున్నారు.

    Also Read :

    Mlc Elections: రాష్ట్రంలో MLC ఎన్నికల హడావిడి

    కాంగ్రెస్, BRS సవాళ్లు.. భూపాల్ పల్లిలో 144 సెక్షన్

    ‘వీరయ్య’తో ‘వీరసింహారెడ్డి’ డైరెక్టర్‌.. ఏంది కథ?

    HCA ఆవార్డులు: మేము పిలిచాం NTR రాలేదు.. క్లారిటీ ఇచ్చిన ‘హలీవుడ్‌ క్రిటిక్స్‌’

     

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular