విధాత:దేవిపట్నం మండలం,పెదవేంపల్లి గ్రామ నిర్వాసితులను పరామర్శించిన నారా లోకేష్.పునరావాస కాలనిలో పర్యటించి గిరిజనుల సమస్యలు తెలుసుకున్న లోకేష్.కొండమొదలు గ్రామం ముంపుకి గురవ్వడంతో కొంత మంది కొండ మీద పాకలు వేసుకొని నివసిస్తున్నారు. కొంతమందిని బలవంతంగా పునరావాస కాలనీల దగ్గరకి తరలించారు.మూడు నెలలుగా ఇక్కడ ఉంటున్నాం. ప్రభుత్వం నుండి కనీస సాయం అందలేదు. నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం లేదు.ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం. ప్యాకేజి వెంటనే విడుదల చేస్తాం అని చెప్పారు. ఇక్కడకొచ్చాకా అధికారుల చుట్టూ […]

విధాత:దేవిపట్నం మండలం,పెదవేంపల్లి గ్రామ నిర్వాసితులను పరామర్శించిన నారా లోకేష్.పునరావాస కాలనిలో పర్యటించి గిరిజనుల సమస్యలు తెలుసుకున్న లోకేష్.కొండమొదలు గ్రామం ముంపుకి గురవ్వడంతో కొంత మంది కొండ మీద పాకలు వేసుకొని నివసిస్తున్నారు. కొంతమందిని బలవంతంగా పునరావాస కాలనీల దగ్గరకి తరలించారు.మూడు నెలలుగా ఇక్కడ ఉంటున్నాం. ప్రభుత్వం నుండి కనీస సాయం అందలేదు. నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం లేదు.ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం.

ప్యాకేజి వెంటనే విడుదల చేస్తాం అని చెప్పారు. ఇక్కడకొచ్చాకా అధికారుల చుట్టూ తిరుగుతూ అర్జీలు పెట్టుకోవడం తప్ప స్పందించిన వారెవ్వరూ లేరు.పునరావాస కాలనీల్లో కనీస సౌకర్యాలు కల్పించడం లేదు.

ఆంధ్రప్రదేశ్ పేరులోనే అమరావతి,పోలవరం ఉన్నాయి.అమరావతి కోసం రైతులు భూమి త్యాగం చేసారు.పోలవరం కోసం 1.90 లక్షల మంది త్యాగం చేసారు.ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం కోసం త్యాగం చేసిన గిరిజనుల్ని జగన్ రెడ్డి అవమానిస్తున్నరు.ఇది 1.90 లక్షల నిర్వాసితుల సమస్య కాదు 5 కోట్ల ఆంధ్రుల సమస్య.ప్రతిపక్షంలో ఇచ్చిన హామీలు జగన్ రెడ్డికి గుర్తురావడం లేదు.జగన్ రెడ్డి గిరిజనుల్ని ముంచేసారు.10 లక్షల ప్యాకేజి అన్నారు. 1.15 వేలు ఇచ్చిన వారికి అదనంగా 5 లక్షల ప్యాకేజి అన్నారు. ఒక్క రూపాయి కూడా విడుదల చెయ్యకుండా గిరిపుత్రులను వేధిస్తున్నారు.18 ఏళ్ళు నిండిన వారికి ప్యాకేజి అన్నారు.ఇప్పుడు దాని గురించి మాట్లాడటం లేదు.పునరావాస కాలనీల్లో కనీస మౌలిక వసతులు కల్పించడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైంది.గిరిజనుల హక్కుల కోసం పోరాడిన అల్లూరి సీతారామరాజు గారిని ఆదర్శంగా తీసుకొని పోరాడాలి.ప్రతిపక్షంలో ముద్దులు పెట్టిన జగన్ ఇప్పుడు జేసీబీలు పంపి నిర్వాసితుల ఇళ్లు కూలుస్తున్నారు.మీకు న్యాయం జరిగే వరకూ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది.

…నారా లోకేష్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి

Updated On 1 Sep 2021 12:12 PM GMT
subbareddy

subbareddy

Next Story