విధాత:ఈ నెల 8వ తేదీ నుంచి మరిన్ని సడలింపులు ఇవ్వాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు, జిమ్ములు, ఫంక్షన్‌ హాళ్లు ఈ తేదీ నుంచి తెరచుకోనున్నాయి. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూనే, కర్ఫ్యూ సడలింపు సమయంలో వీటిని తెరచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం కొవిడ్‌పై సమీక్ష నిర్వహించారు. సినిమా థియేటర్లలో గతంలో మాదిరిగా సీటుకూ సీటుకూ మధ్య ఖాళీ తప్పనిసరి నిబంధన వర్తిస్తుంది. […]

విధాత:ఈ నెల 8వ తేదీ నుంచి మరిన్ని సడలింపులు ఇవ్వాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు, జిమ్ములు, ఫంక్షన్‌ హాళ్లు ఈ తేదీ నుంచి తెరచుకోనున్నాయి. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూనే, కర్ఫ్యూ సడలింపు సమయంలో వీటిని తెరచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం కొవిడ్‌పై సమీక్ష నిర్వహించారు. సినిమా థియేటర్లలో గతంలో మాదిరిగా సీటుకూ సీటుకూ మధ్య ఖాళీ తప్పనిసరి నిబంధన వర్తిస్తుంది. జన సమ్మర్థం ఉంటే చోట కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, మాస్కులు ధరించాలని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్లు వాడాలని ఆదేశించారు.

Updated On 6 July 2021 12:41 PM GMT
Venkat

Venkat

Next Story