విధాత‌:గత ఏడాదిన్నర కాలంలో 32 నోటిఫికేషన్ల ఇంటర్వ్యూలు నిర్వహించాము. గ్రూప్ వన్ , పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల భర్తీ కోర్టులో ఉన్నందున పెండింగ్ లో ఉన్నాయన్నారు ఏపీపీఎస్సీ సభ్యులు సలీం. ఏపీపీఎస్సీ గత ఏడాదిన్నర కాలంగా పారదర్శకంగా వ్యవహరిస్తోందని ఇకపై ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షల కు ప్రిలిమ్స్ రద్దు చేస్తున్నామ‌ని గ్రూప్ వన్ పోస్ట్ లకు మాత్రం ప్రిలిమ్స్ నిర్వ‌హిస్తాం అన్నారు.ప్రిలిమ్స్ పరీక్ష రద్దుకు సంబంధించి జీఓ లు 39, 150 లను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని […]

విధాత‌:గత ఏడాదిన్నర కాలంలో 32 నోటిఫికేషన్ల ఇంటర్వ్యూలు నిర్వహించాము. గ్రూప్ వన్ , పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల భర్తీ కోర్టులో ఉన్నందున పెండింగ్ లో ఉన్నాయన్నారు ఏపీపీఎస్సీ సభ్యులు సలీం.

ఏపీపీఎస్సీ గత ఏడాదిన్నర కాలంగా పారదర్శకంగా వ్యవహరిస్తోందని ఇకపై ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షల కు ప్రిలిమ్స్ రద్దు చేస్తున్నామ‌ని గ్రూప్ వన్ పోస్ట్ లకు మాత్రం ప్రిలిమ్స్ నిర్వ‌హిస్తాం అన్నారు.ప్రిలిమ్స్ పరీక్ష రద్దుకు సంబంధించి జీఓ లు 39, 150 లను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరాం,ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఆగస్టు నుంచి ఏపీపీఎస్సీ అమలు చేస్తుంది.ఆగస్టులో కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తాం,39జీవోకు అదనంగా1184 పోస్ట్ లకు నోటిఫికేషన్ ఇస్తాం.వయోపరిమితి సడలింపుకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం వయోపరిమితి 47 ఏళ్లకు పెంచాలని నిరుద్యోగులు కోరారన్నారు.

Updated On 16 July 2021 10:06 AM GMT
subbareddy

subbareddy

Next Story