విశాఖపట్నం డివిజన్‌ పరిధిలో రాయగడ-విజయనగరం మార్గంలో ట్రాక్‌ ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది.

విశాఖపట్నం డివిజన్‌ పరిధిలో రాయగడ-విజయనగరం మార్గంలో ట్రాక్‌ ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని కొద్దిసేపు నిలిపివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 19న నడవాల్సిన విశాఖ - రాయగడ (08504), 20న రాయగడ - విశాఖపట్నం (08503), విశాఖపట్నం-కొరాపుట్‌-విశాఖపట్నం (08546/08545), విశాఖపట్నం-కొరాపుట్‌(18512), 21న కొరాపుట్‌-విశాఖపట్నం (18511) రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది.

అలాగే ఈ నెల 19న ఎర్నాకుళం-టాటా ఎక్స్‌ప్రెస్‌ (18190)ను మార్గమధ్యంలో రెండు గంటలు నిలిపివేయనున్నారు. అలప్పూజా-ధన్‌బాద్‌ (13352) బొకారో ఎక్స్‌ప్రెస్‌ను గంట పాటు నిలిపివేస్తారు. ఖుర్ధా రోడ్‌ డివిజన్‌ కిషన్‌గంజ్‌-నెరగుండి స్టేషన్ల మధ్య ఆర్‌వోబీ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 16న హౌరా-సికింద్రాబాద్‌ (12703) ఫలక్‌నుమాను రెండున్నర గంటలు, 15న ఎస్‌ఎంవీ బెంగళూరు-హౌరా (12864) మూడు గంటలు ఆలస్యంగా బయలుదేరనున్నాయి.

అదే సమయంలో గుంతకల్‌ డివిజన్‌లో భద్రతా పరమైన పనుల నేపథ్యంలో ఈ నెల 18న యశ్వంత్‌పూర్‌-పూరీ (22884) ఎక్స్‌ప్రెస్‌ గుత్తి ఫోర్ట్‌, ఎర్రగుంట్ల మీదుగా దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు. అలాగే డోన్‌ హాల్ట్‌ను రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రయాణికులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Updated On
Somu

Somu

Next Story