ప్రయాణికులకు అలెర్ట్..! విజయవాడ డివిజన్‌లో వారం పాటు భారీగా రైళ్లు రద్దు..!
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు అలెర్ట్‌ను జారీ చేసింది. విజయవాడ డివిజన్‌లో వారం రోజుల పాటు పెద్ద ఎత్తున రైళ్లను రద్దుచేసింది. మరికొన్నింటిని దారి మళ్లించింది.

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు అలెర్ట్‌ను జారీ చేసింది. విజయవాడ డివిజన్‌లో వారం రోజుల పాటు పెద్ద ఎత్తున రైళ్లను రద్దుచేసింది. మరికొన్నింటిని దారి మళ్లించింది. డివిజన్‌లో పలు మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసింది.
పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ప్రయాణికులు సహకరించాలని కోరింది. ఈ నెల 13 నుంచి 17 వరకు బిట్రగుంట-చెన్నై సెంట్రల్ (17237), చెన్నై సెంట్రల్ - బిట్రగుంట (17238) రైళ్లను రద్దు చేసింది. ఇక విజయవాడ - విశాఖపట్నం (22702) రైలు, విశాఖపట్నం - విజయవాడ (22701) ఈ నెల 13, 14, 15, 17, 18 తేదీల్లో రద్దు చేసినట్లు పేర్కొంది.
కాకినాడ - విశాఖపట్నం (17267), విశాఖపట్నం - కాకినాడ పోర్ట్ (17268), రాజమండ్రి – విశాఖపట్నం (07466), విశాఖపట్నం – రాజమండ్రి (07467), మచిలీపట్నం – విశాఖపట్నం (17219), గుంటూరు – రాయగడ (17243), గుంటూరు – విశాఖపట్నం (17239), బిట్రగుంట - విజయవాడ బిట్రగుంట – విజయవాడ (07977) విజయవాడ – బిట్రగుంట (07978) విజయవాడ – తెనాలి (07279), విజయవాడ – ఒంగోలు (07461), ఒంగోలు – విజయవాడ (07576), విజయవాడ – గూడూరు (07500) తెనాలి – విజయవాడ (07575) రైళ్లను 17వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
ఇక ఈ నెల 14 నుంచి 20 వరకు విశాఖపట్నం – మచిలీపట్నం (17220) రాయగడ – గుంటూరు (17244), విశాఖపట్నం – గుంటూరు (17240), గూడూరు – విజయవాడ (07458) రద్దు చేస్తున్నట్లు తెలిపింది. వాటితో పాటు మరికొన్ని రైళ్లను పాక్షింగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వివరించింది.
