దక్షిణ మధ్య రైల్వే మరోసారి ప్రయాణికులకు అలెర్ట్‌ను జారీ చేసింది. విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో రైల్వే ట్రాక్‌లకు మరమ్మతు పనులు చేపడుతున్నది.

దక్షిణ మధ్య రైల్వే మరోసారి ప్రయాణికులకు అలెర్ట్‌ను జారీ చేసింది. విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో రైల్వే ట్రాక్‌లకు మరమ్మతు పనులు చేపడుతున్నది. ఈ క్రమంలో పలు రైళ్లను రద్దు చేశారు. అదే సమయంలో మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది. ఇంతకు ముందే చేపట్టిన పనులు ఇంకా పూర్తికాకపోవడంతో రద్దు చేసిన రైళ్లను పొడిగిస్తున్నట్లు పేర్కొంది. వాస్తవానికి షెడ్యూల్‌ ప్రకారం పనులన్నీ 13 వరకు పూర్తికావాల్సి ఉంది.

అయితే, ఇంకా పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నెల 19 వరకు ఆయా రైళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. గుంటూరు-విశాఖపట్నం (17239), విశాఖపట్నం-గుంటూరు (17240), విశాఖపట్నం - బెజవాడ (22701) బెజవాడ -విశాఖపట్నం (22702), రాజమండ్రి -విశాఖపట్నం (07466), విశాఖపట్నం -రాజమండ్రి (07467), కాకినాడ -విశాఖపట్నం (17267) విశాఖపట్నం-కాకినాడ (17628) రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొంది.

అలాగే విశాఖపట్నం-విశాఖపట్నం (12717), విజయవాడ - విశాఖపట్నం ( 12718) విశాఖపట్నం -మచిలీపట్నం (17219) మచిలీపట్నం -విశాఖపట్నం (17220) గుంటూరు - రాయగడ (17243), రాయగడ -గుంటూరు (17244) రైళ్లను రద్దు చేసినట్లు వివరించింది. మరికొన్ని రైళ్లు దారి మళ్లించినట్లు వివరించింది. ప్రయాణికులు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.

Updated On
Somu

Somu

Next Story