మంగళగిరి- కరోనా మహమ్మారి దాటికీ అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు.వైరస్ ప్రభావం కుటుంబాల్లో తీరని తీర్చలేని విషాదాన్ని నింపింది.ఈ నేపథ్యంలో 90 ఏళ్ల వృద్ధుడు కోవిడ్ ను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకున్నాడు.వివరాలిలా ఉన్నాయి. మంగళగిరి పట్టణంలోని 30 వ వార్డు పార్క్ రోడ్డు 9 వ లైనుకు చెందిన బత్తుల వెంకటేశ్వరరావు జ్వరం,జలుబు తో ఇబ్బంది పడుతుండటంతో కుటుంభ సభ్యులు కోవిడ్ టెస్ట్ చేయించారు.ఫలితం పాజిటీవ్ గా నిర్ధారణ అయింది.వృద్దాప్యం కావటం దీనికి కోవిడ్ […]

మంగళగిరి- కరోనా మహమ్మారి దాటికీ అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు.వైరస్ ప్రభావం కుటుంబాల్లో తీరని తీర్చలేని విషాదాన్ని నింపింది.ఈ నేపథ్యంలో 90 ఏళ్ల వృద్ధుడు కోవిడ్ ను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకున్నాడు.వివరాలిలా ఉన్నాయి.

మంగళగిరి పట్టణంలోని 30 వ వార్డు పార్క్ రోడ్డు 9 వ లైనుకు చెందిన బత్తుల వెంకటేశ్వరరావు జ్వరం,జలుబు తో ఇబ్బంది పడుతుండటంతో కుటుంభ సభ్యులు కోవిడ్ టెస్ట్ చేయించారు.ఫలితం పాజిటీవ్ గా నిర్ధారణ అయింది.వృద్దాప్యం కావటం దీనికి కోవిడ్ తోడవడంతో ఆందోళన చెందిన కుటుంభ సభ్యులు కోవిడ్_19 ఇన్సిడెంట్ కమాండర్ మంగళగిరి తహసీల్ధార్ జీవి రామ్ ప్రసాద్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకు వెళ్లారు.వెంటనే స్పందించిన రామ్ ప్రసాద్ ఎయిమ్స్ వైద్యశాల వైద్యులతో మాట్లాడి ఆసుపత్రిలో బెడ్ ఏర్పాటు చేయించారు.

దీనితో ఈ నెల 18 వ తేదీన వెంకటేశ్వరరావు ఎయిమ్స్ లో చేరాడు.అయిదు రోజుల చికిత్స అనంతరం సంపూర్ణ ఆరోగ్యంతో కోవిడ్ ను జయించి ఇంటికి చేరుకున్నాడు.వైద్యులు సూచించిన ప్రకారం సమయానికి మెడిసిన్,ఆహారం తీసుకున్నానని వెంకటేశ్వరరావు పేర్కొన్నాడు.ఎయిమ్స్ లో కోవిడ్ బాధితుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని,చక్కటి వాతావరణం మధ్య మహమ్మారి నుండి తేలిగ్గా కోలుకునే అవకాశం ఉందని అన్నారు.వైరస్ సోకినా భయపడకుండా వైద్యుల సలహాలు పాటిస్తే కోవిడ్ ను సులువుగా ఎదుర్కొనవచ్చని తెలిపాడు.తనకు బెడ్ కేటాయింపు చేయించిన తహసీల్ధార్ రామ్ ప్రసాద్,సేవలందించిన వైద్యులు,సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

Updated On 23 May 2021 12:15 PM GMT
subbareddy

subbareddy

Next Story