పరిశ్రమలకు ప్రోత్సాహకాలతో ఊతం, పారిశ్రామికాభివృద్ధి మరింత బలోపేతంఎమ్ఎస్ఎమ్ఈలు, స్పిన్నింగ్ మిల్లులకు ప్రోత్సాహకాలను బటన్ నొక్కి జమ చేయనున్న సీఎం విధాత:అమరావతి; గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా ఐదేళ్లూ చిన్న పరిశ్రమలపై చిన్న చూపు చూపింది. కానీ, "కష్టకాలంలో ఆదాయం పడిపోయినా రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ మూత పడకూడదు, ఒక్క ఉద్యోగి రోడ్డు మీద పడకుడదు" అనే ఉక్కు సంకల్పంతో ప్రభుత్వం అండగా నిలిచిందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. గత ఏడాది కరోనా […]

పరిశ్రమలకు ప్రోత్సాహకాలతో ఊతం, పారిశ్రామికాభివృద్ధి మరింత బలోపేతం
ఎమ్ఎస్ఎమ్ఈలు, స్పిన్నింగ్ మిల్లులకు ప్రోత్సాహకాలను బటన్ నొక్కి జమ చేయనున్న సీఎం

విధాత:అమరావతి; గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా ఐదేళ్లూ చిన్న పరిశ్రమలపై చిన్న చూపు చూపింది. కానీ, "కష్టకాలంలో ఆదాయం పడిపోయినా రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ మూత పడకూడదు, ఒక్క ఉద్యోగి రోడ్డు మీద పడకుడదు" అనే ఉక్కు సంకల్పంతో ప్రభుత్వం అండగా నిలిచిందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. గత ఏడాది కరోనా విపత్తు విరుచుకుపడి ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలు మూతపడుతున్న వేళ మే,22వ తేదీ, 2020న ఎమ్ఎస్ఎమ్ఈలకు రీస్టార్ట్ ప్యాకేజీ కింద మొదటి విడతగా రూ.450.27 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. అదే ఏడాది జూన్ 29న మరోసారి ఎమ్ఎస్ఎమ్ఈలకు రూ.453.64 కోట్లు రెండో విడతగా , ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు రూ.58.51 కోట్లు విడుదల చేసినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు రెండో విడతగా శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రోత్సాహకాల మొత్తాన్ని ముఖ్యమంత్రి ఒక్క బటన్ నొక్కి లబ్ధిదారులకు జమ చేస్తారు.
ఎమ్ఎస్ఎమ్ఈలు, స్పిన్నింగ్ మిల్లులు, టెక్స్టైల్ లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహకాల బకాయిలను రేపు చెల్లించనుంది.

అయితే, గత ప్రభుత్వం 2015 నుంచి ఎమ్ఎస్ఎమ్ఈలకు రూ.904 కోట్లు, స్పిన్నింగ్ మిల్లులకు రూ.684 కోట్లు; మొత్తం రూ.1,588 కోట్ల బకాయిలను పెట్టింది. కానీ, ఈ ప్రభుత్వం మాత్రం వాళ్లు పెండింగ్ లో పెట్టిన బకాయిలతో పాటు ప్రస్తుతం పరిశ్రమలకు అందించాల్సిన బకాయిలను కలిపి ప్రణాళిక ప్రకారం బాధ్యతగా చెల్లిస్తోంది. ప్రోత్సాహకాలు అందుకుంటోన్న పారిశ్రామికవేత్తలైన లబ్ధిదారులలో సగానికి పైగా బడుగు,బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులకు చెందిన వారే ఉన్నారని మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు.

రెండేళ్ళలో ఎన్నో భారీ పరిశ్రమలు..ఎక్కువ మందికి ఉపాధినందించే ఎన్నెన్నో పెట్టుబడులు

కేవలం ఈ రెండేళ్లలోనే, రూ.5,204.09 కోట్ల విలువైన 16,311 ఎమ్ఎస్ఎమ్ఈ యూనిట్లను నెలకొల్పడం ;ఈ సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమల ద్వారా 1,13,777 మందికి ఉద్యోగాలందించడం మా ప్రభుత్వ ఆలోచనల అంకితభావానికి నిదర్శనమని మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. 2019లో మా ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకూ 68 లార్జ్ అండ్ మెగా పరిశ్రమలలో ఉత్పత్తిని ప్రారంభించగలిగామన్నారు. రూ.30,175 కోట్ల విలువైన పెట్టబడులు ఏపీకి తీసుకు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. మొత్తానికి, కరోనా విపత్తులో కూడా 46,119 మందికి ఉద్యోగాలు అందించామన్నారు.

సకల సదుపాయాలతోనే సమగ్ర పారిశ్రామికాభివద్ధి సాధ్యం

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తోందని మంత్రి మేకపాటి పునరుద్ఘాటించారు. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు వసతుల కల్పనకు అదనపు ఖర్చు పెట్టడానికి అవకాశమే లేని స్థాయిలో సకల సదుపాయాలతో కూడిన పారిశ్రామికాభివృద్ధే ధ్యేయంగా 24×7 విద్యుత్, నీరు, పరిశ్రమల స్థాపనకు కావలసిన భూములు, మానవవనరులను అందించడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

అన్నింటా ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ : మంత్రి మేకపాటి

ఆంధ్రప్రదేశ్ లో మారుతున్న పరిస్థితులు, అందుబాటులోని వనరులకు తగ్గట్లుగా వాణిజ్యపరమైన సంస్కరణలు చేపడుతూ సులభతర వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్ ని అగ్రస్థానంలో నిలబెట్టాం. 2019కి సంబంధించి సెప్టెంబర్ , 2020లో భారత ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన ఈడీబీ ర్యాంకులలో ఏపీ టాప్ ప్లేస్ లో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 187 రిఫార్మ్ ఏరియాలను వందశాతం ఆచరణలో చూపించింది. స్నేహపూర్వక వాణిజ్య వాతావరణం సృష్టించడంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశంలోనే తొలిసారిగా ఎమ్ఎస్ఎమ్ఈల కోసం రీస్టార్ట్ ప్యాకేజీ ప్రవేశ పెట్టిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా నిలిచింది.

Updated On 2 Sep 2021 12:20 PM GMT
Venkat

Venkat

Next Story