విధాత‌: ఏపీలోని పెద్దాసుపత్రుల ఆవరణలో కొవిడ్ కేర్ సెంటర్ల త‌ర‌హాలో తాత్కాలిక బెడ్లు ఏర్పాటు చేయబోతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఒప్పందం ప్రకారం నెట్ వర్క్ ఆసుపత్రులతో పాటు కొవిడ్ చికిత్సల కోసం జిల్లా కలెక్టర్ల అనుమతులు పొందిన ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ సగానికి పైగా బెడ్లు నిండిపోయినా ఆర్యో శ్రీ పథకం వైద్య సేవలు పొందే కరోనా బాధితులకు బెడ్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం రాష్ట్ర […]

విధాత‌: ఏపీలోని పెద్దాసుపత్రుల ఆవరణలో కొవిడ్ కేర్ సెంటర్ల త‌ర‌హాలో తాత్కాలిక బెడ్లు ఏర్పాటు చేయబోతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఒప్పందం ప్రకారం నెట్ వర్క్ ఆసుపత్రులతో పాటు కొవిడ్ చికిత్సల కోసం జిల్లా కలెక్టర్ల అనుమతులు పొందిన ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ సగానికి పైగా బెడ్లు నిండిపోయినా ఆర్యో శ్రీ పథకం వైద్య సేవలు పొందే కరోనా బాధితులకు బెడ్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీచేయనుందన్నారు. ఆసుపత్రులకు ఆక్సిజన్ తరలింపు కోసం 25 క్రయోజనిక్ ట్యాంకర్లు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 76 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి లక్ష్యంగా ప్లాంట్లను ప్రభుత్వం నిర్మించనుందన్నారు. ఇప్పటికే ఆరు ప్లాంట్లు ఉత్పత్తి ప్రారంభించగా, మరో ఆరు ప్లాంట్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ పేషంట్లకు అందుతున్న వైద్య సేవలపైనా, బెడ్లు అందుబాటులో ఉన్న బెడ్లుపైనా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షించారన్నారు. గడిచిన 24 గంటల్లో 1,10,147 కరోనా టెస్టులు చేయగా, 21,954 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 72 మంది మృతి చెందారని ఆయన తెలిపారు.
పీఎం మోడికి సీఎం లేఖ..
గడిచిన 24 గంటల్లో 472 మెట్రిక్ టన్నులు లిక్విడ్ ఆక్సిజన్ అందజేశామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొవిడ్ సెంటర్లలో 13,356 మంది వైద్య సేవలు పొందుతున్నారని, రోజుకు వెయ్యి మంది వరకూ కొత్తగా చేరుతున్నారని తెలిపారు. కొవిడ్ కేర్ సెంటర్లలో 30,880 బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. రోజు రోజుకూ పెరుగుతున్న కేసుల నేపథ్యంలో బెడ్లు పెంచుకోవాల్సిన అవసరముందన్నారు. పెరుగుతున్న కేసుల దృష్ట్యా ఆక్సిజన్ కేటాయింపులు మరింత పెంచాలని ప్రధానమంత్రి నరేంద్రమోడికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. ఆక్సిజన్ సరఫరా కోసం ఏర్పాటైన కేంద్ర ప్రభుత్వ కమిటీకి కూడా ఇదే విషయం తెలిపామన్నారు.
25 క్రయోజినిక్ ట్యాంకర్ల కొనుగోలుకు నిర్ణయం…
ఆక్సిజన్, లిక్విడ్ ఆక్సిజన్ రవాణా, స్టోరేజ్ కోసం కోసం 25 క్రయోజనిక్ ట్యాంకర్లు కొనుగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సీనియర్ అధికారుల కొనుగోలు కమిటీ నిర్ణయించిందన్నారు. ఒక్కో ట్యాంకర్ 20 టన్నుల కెపాసిటీ కలిగి ఉంటుందన్నారు. 25 ట్యాంకర్లు 500 టన్నుల కెపాసిటీ కలిగి ఉంటాయన్నారు. మూడు, నాలుగు వారాల్లో ట్యాంకర్లు అందుబాటులోకి రానున్నాయన్నారు. 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ను కొనుగోలుకు ఆర్డర్లిచ్చామన్నారు. రాష్ట్ర్రంలో 76 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇప్పటికే 6 ప్లాంట్లు 25 టన్నుల ఆక్సిజన్ సామర్థ్యంతో ఉత్పత్తి ప్రారంభమైందన్నారు. 19 టన్నుల కెపాసిటీతో నిర్మించిన మరో నాలుగు ప్లాంట్లు మూడు నాలుగు రోజుల్లో అందుబాటులోకి రానున్నాయన్నారు. మరికొన్ని రోజుల్లో మరో 2 రెండు ప్లాంట్లు అందుబాటులోకి వచ్చేలా పనులు జరుగుతున్నారు.

మొదటి విడత ఇంటింటి సర్వే పూర్తి…
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జ్వరపీడితులను గుర్తించడానికి చేపట్టిన మొదటి విడత ఇంటింటి సర్వే ఇప్పటికే పూర్తయిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ప్రస్తుతం రెండో విడత సర్వే జరుగుతోందన్నారు. ఏ రాష్ట్రానికి లేనంత క్షేత్ర స్థాయి సిబ్బంది ఏపీలో ఉన్నారన్నారు. గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగులు, వలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తులు వంటి కిందిస్థాయి సిబ్బంది ఉన్నారు. ఫీవర్ పేషంట్లను గుర్తించి మందులు సరఫరా చేస్తున్నారన్నారు.

Updated On 7 May 2021 5:22 AM GMT
subbareddy

subbareddy

Next Story