రాయలసీమకు చేసింది శూన్యం.49 ఎమ్మెల్యే స్థానాలు యిచ్చిన రాయలసీమకు జరగని న్యాయం.రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటీ(ఆర్ జెఎసి) విధాత,కర్నూల్:రాయలసీమకు ఈ రెండు సంవత్సరాల కాలంలో వైసిపి ప్రభుత్వం చేసింది శూన్యమని గురువారం రోజు ఆర్ జెఎస్ నాయకులు స్థానిక బిక్యాంప్ లోని కార్యాలయంలో పత్రిక విలేకరుల సమావేశం నిర్వరించారు.ఈ సందర్భంగా రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటి కన్వీనర్ సీమకృష్ణ,చైర్మన్ రవికుమార్,కన్వీనర్ రంగముని నాయుడు మాట్లాడుతూ రాయలసీమ ప్రజలు వైసిపి ప్రభుత్వానికి 52 ఎమ్మెల్యే స్థానాలకు గాను 49 […]

రాయలసీమకు చేసింది శూన్యం.
49 ఎమ్మెల్యే స్థానాలు యిచ్చిన రాయలసీమకు జరగని న్యాయం.
రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటీ(ఆర్ జెఎసి)

విధాత,కర్నూల్:రాయలసీమకు ఈ రెండు సంవత్సరాల కాలంలో వైసిపి ప్రభుత్వం చేసింది శూన్యమని గురువారం రోజు ఆర్ జెఎస్ నాయకులు స్థానిక బిక్యాంప్ లోని కార్యాలయంలో పత్రిక విలేకరుల సమావేశం నిర్వరించారు.ఈ సందర్భంగా రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటి కన్వీనర్ సీమకృష్ణ,చైర్మన్ రవికుమార్,కన్వీనర్ రంగముని నాయుడు మాట్లాడుతూ రాయలసీమ ప్రజలు వైసిపి ప్రభుత్వానికి 52 ఎమ్మెల్యే స్థానాలకు గాను 49 స్థానాలు ఇచ్చిన సీమకు చేసింది శూన్యమని మండిపడ్డారు.మరి ముఖ్యంగా అసెంబ్లీ సాక్షిగా శ్రీబాగ్ ఒప్పందంలో భాగంగా రాయలసీమకు న్యాయరాజధాని ప్రకటించి ఇంతవరుకు అతిగతిలేదని మండిపడ్డారు.

న్యాయరాజధాని కర్నూల్ కి ప్రకటించిన తరువాత కూడ అమరావతిలో ఉన్న హైకొర్టు భవనాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించడం సీమ ప్రజలు మోసం చేయటమే అన్నారు.హైకోర్ట్ ప్రక్కనే మరో భవనాన్ని నిర్మించడానికి ఎఎమ్ఆర్డి(AMRD) టెండర్లు పిలిచిందని దీనిని ఏ విధంగా అర్థం చేసుకోవాలని అన్నారు. నిర్మాణం కోసం రూ 29.40 కోట్లతో అంచవేసారని అన్నారు.వెంటనే టెండర్లు రద్దు చేసి న్యాయరాజధాని వెంటనే కర్నూల్ కి తరిలించాలన్నారు.
వైసిపి ప్రభుత్వం రాయలసీమ ప్రజలను మోసం చేస్తే తగిన బుద్ది చెపుతామని అన్నారు.ఈకార్యక్రమంలో ఆర్ జెఎసి నాయకులు అశోక్,రమేష్ గౌడ్,గోపాల్,హరినాయుడు పాల్గోన్నారు.

Updated On 20 Aug 2021 4:24 AM GMT
Venkat

Venkat

Next Story