HomeLatest newsజానీ డెప్‌.. ఫ్లీజ్‌ మా సినిమాలో నటించండి రూ.2,535 కోట్లు ఇస్తాం

జానీ డెప్‌.. ఫ్లీజ్‌ మా సినిమాలో నటించండి రూ.2,535 కోట్లు ఇస్తాం

  • మాజీ భార్యపై పరువు నష్టం దావా కేసు గెలిచిన జానీ డెప్
  • హీరోకు క్షమాపణలు
  • పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ మూవీ ఫ్రాంచైజీ కోసం భారీ ఆఫర్‌

విధాత‌: ‘పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్’ సీరిస్‌ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హాలీవుడ్ నటుడు జానీ డెప్. 2018లో ఆయన మాజీ భార్య అంబర్ హెర్డ్ చేసిన కామెంట్స్‌పై కోర్టులో పరువు నష్టం దావా వేశాడు. దాదాపు ఆరు వారాల పాటు విచారణ ఈ కేసులో జానీ డెప్‌కు అనుకూలంగా తీర్పు వ‌చ్చింది.

దీంతో పాటు ఆయనకి 50 మిలియన్ల డాలర్లను న‌ష్ట పరిహారంగా చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే.. అప్పట్లో విడాకుల కేసు సందర్భంగా డెప్‌ తనపై గృహ హింసకి పాల్పడ్డాడని అంబర్ ఆరోపణలు చేయడం, ఆయన కెరీర్‌పై చాలా ప్రభావాన్ని చూపింది. ఆ సమయంలో ఫెంటాస్టిక్ బీస్ట్-3, పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ వంటి సినిమాల నిర్మాణ సంస్థలు ఆయనతో మూవీ చేయడానికి నిరాకరించాయి.

అయితే.. తాజాగా జానీ డెప్‌ పరువునష్టం దావా కేసు గెలవడంతో డెప్ తన కెరీర్‌ని గాడిలో పెట్టుకునే పనిలో ఉన్నాడు. ఈ క్ర‌మంలో డిస్నీ సంస్థ డెప్‌ని పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ మూవీలో జాక్ స్పారోగా మరోసారి నటించడానికి రూ. 2,535 కోట్ల ఆఫర్‌తో పాటు క్షమాపణ కోరుతూ ఓ లేఖని పంపిందని తెలుస్తోంది.

ఎంతో పాపులర్ అయిన ఈ ఫ్రాంచైజీలో ఇప్పటి వరకూ మొత్తం ఐదు భాగాలలో ఈ స్టార్ జాక్ స్పారోగా నటించాడు. కాగా.. ఈ న్యూస్ గురించి డెప్ వైపు నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. డిస్నీ క్షమాపణలను ఈ నటుడు అంగీకరించాడో ఇంకా తెలియలేదు.

అయితే.. డిస్నీ సంస్థ ఆఫర్ చేసిన మనీ పరువు నష్టం దావాలో డెప్ కోట్ చేసిన మొత్తానికి దగ్గరగా ఉండటం గ‌మ‌నార్హం. కానీ.. ఎంత మనీ ఇచ్చిన జాక్ స్పారోగా నటించడానికి ఈ హాలీవుడ్ స్టార్ ఇంట్రస్ట్‌గా లేడని తెలుస్తోంది.

RELATED ARTICLES

తాజా వార్త‌లు

error: Content is protected !!