Home Latest news ప్రశాంతంగా ముగిసిన ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్

ప్రశాంతంగా ముగిసిన ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్

విధాత‌, ఆత్మ‌కూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.61.75 శాతం పోలింగ్‌ నమోదైంది. దివంగ‌త‌ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణంతో ఖాళీ అయిన ఆత్మకూరు నియోజకవర్గంలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరిగింది.

సాయంత్రం 6 గంటల లోపు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓటర్లందరినీ అధికారులు ఓటింగ్‌కు అనుమతి ఇచ్చారు. ఐతే సాయంత్రం 5 గంటల వరకు 62 శాతానికి పైగా పోలింగ్‌ నమోదైంది.

సాయంత్రం 5.30 గంటల వరకు ఆత్మకూరులో 62.88 శాతం, చేజర్లలో 62.5 శాతం, సంగంలో 65.52 శాతం, ఏఎస్‌ పేటలో 65.75 శాతం, అనంతసాగరంలో 64.68 శాతం, మర్రిపాడులో 63.68 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

ఉప ఎన్నికల బరిలో 14 మంది అభ్యర్ధులు ఉన్నారు. వైసీపీ నుంచి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి బరిలో ఉండగా టీడీపీ పోటీ చేయలేదు. బీజేపీ నుంచి జి.భరత్ కుమార్, బీఎస్‌పీ నుంచి ఎన్.ఓబులేసుతో పాటు మరో ఐదుగురు గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు, ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో మొత్తం 2,13,338 మంది ఓటర్లున్నారు.

ఉప ఎన్నిక కోసం మొత్తం 279 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 131 సమస్యాత్మక, 148 సాధారణ పోలింగ్‌ కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. ఉప ఎన్నికను అన్ని పోలింగ్‌ కేంద్రాల నుంచి వెబ్‌కాస్టింగ్‌ లైవ్‌ ద్వారా ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. ఎన్నికల విధుల్లో 1,409 పోలింగ్ సిబ్బంది పాల్గొనగా 1100 మందితో పోలీస్ బందో బస్తును ఏర్పాటు చేశారు. ఈనెల 26వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.

ప్రతిఒక్కరికి ధన్యవాదాలు: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి

ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలలో చెదురు మదురు సంఘటనలు మినహా మొత్తం మీద ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో చక్కగా జరిగాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్ మీనా తెలిపారు. ఇందుకు సహకరించిన ప్రతిఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

సాయంత్రం 6.00 గంటలకు రావాల్సిన తుది పోలింగ్ శాతం ఇంకా రాలేదని, సాయంత్రం 5.00 గంటలకు 61.70% పోలింగ్ నమోదు అయిందని, మొత్తం మీద 69 %  నుంచి 70% వరకు  పోలింగ్ నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు.

ఉదయం 7.00 గంటలకు మాక్ పోల్ తదుపరి మొత్తం తొమ్మిది (ఒక బి.యు., మూడు సి.యు., ఐదు వివిప్యాడ్) ఇ.వి.ఎమ్.లలో కొద్దిగా సాంకేతిక సమస్య ఏర్పడిందని, ఆ సమస్యను వెంటనే పరిష్కరించి అన్ని పోలింగ్ స్టేషన్లలో  వెంటనే పోలింగ్ ప్రారంభించడం జరిగిందన్నారు.

ఆత్మకూరులోని ఆంధ్రా ఇంజినీరింగ్ కళశాలలో స్ట్రాంగ్ రూం ఏర్పాటు చేయడం జరిగిందని, ఎన్నికలు పూర్తయిన తదుపరి ఇ.వి.ఎమ్.లను అన్నింటినీ పటిష్ట  పోలీస్ బందోబస్తు మధ్య అచ్చట భద్రపర్చజడం జరిగుతుందని ఆయన తెలిపారు.

131 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లుగా ప్రకటించడం జరిగిందని, ఆయా కేంద్రాల్లో సిసి కెమెరాలు, వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్లను, సెంట్రల్ పోర్సెస్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సి-విజిల్ లో 38 పిర్యాధులు వచ్చాయని, వాటిపై తగు చర్య తీసుకోవడం జరిగిందన్నారు.

1,339 మంది పోలింగ్  సిబ్బందిని,  1,100 పోలీస్ సిబ్బందిని మరియు 3 సెంట్రల్ ఫోరెర్స్ కంపెనీల సేవలను ఈ ఉప ఎన్నికల్లో వినియోగించుకోవడం జరిగిందన్నారు. మొత్తం మీద ఉప ఎన్నికలు ఎంతో ప్రశాంత వాతావరణంలో జరిగాయని ఆయన తెలిపారు.

RELATED ARTICLES

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల నుంచి నగదు మాయం

విధాత : ఏపీలోని వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లోంచి నగదు మాయమైన ఘటన సంచలనం సృష్టిస్తోంది. మొత్తం 90 వేల మంది ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లోని రూ.800 కోట్లు విత్...

ఈ వారం థియేటర్లలో, ఓటీటీల్లో వచ్చే సినిమాలివే

విధాత‌: ఈ వారం థియేటర్లలో వద్ద సినిమాల సందడి కాస్త తగ్గనుంది. ఈ వారం మళయాళ అగ్ర నటుడు పృథ్వీరాజ్‌ నటించిన బహుబాషా చిత్రం కడువ తప్పితే పెద్దగా పేరున్న చిత్రాలేవి విడుదల...

భువనగిరి: వక్ఫ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

విధాత,యాదాద్రి భువనగిరి: భువనగిరి పట్టణంలోని సింగన్నగూడెంలో ఉన్న వక్ఫ్ బోర్డు భూమిలో ఉన్న అక్రమ నిర్మాణాలను అధికారులు మంగళవారం కూల్చివేశారు. సర్వే నెంబర్ 797.798.621లో 4ఎకరాలు వక్ఫ్ భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని...

Alert.. అవసరమైతే తప్పా బయటకు రావొద్దు: GHMC

విధాత‌, హైదరాబాద్: ఇవాళ మధ్యాహ్నం నుంచి కురుస్తున్న మోస్తరు వర్షాలతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. అల్వాల్ సర్కిల్ పరిధిలో దాదాపు గంటన్నర సేపు వర్షం కుర‌వ‌డంతో రహదారులు వర్షపు నీటితో...

మెరుగైన వైద్య సేవల్లో ఎయిమ్స్ ముందంజ: గవర్నర్ తమిళి సై

విధాత, యాదాద్రి భువనగిరి: గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎయిమ్స్ వైద్య సంస్థలు దేశంలోనే ముందంజలో ఉన్నాయని రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ అన్నారు. మంగళవారం ఆమె...

ఆలోచనతో రండి.. ఆవిష్కరణలతో వెళ్లండి: టీ హ‌బ్ 2ను ప్రారంభించిన CM KCR

విధాత‌, హైద‌రాబాద్: ‘ఆలోచనతో రండి – ఆవిష్కరణలతో వెళ్లండి’’ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లోని మాదాపూర్-రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్, ‘టీ...

తాజా వార్త‌లు

తెలంగాణ ప్రభుత్వం అంటే నాకు చాలా ఇష్టం: AR రెహమాన్

విధాత: తెలంగాణ ప్రభుత్వం ఐటీ హబ్ హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టీ-హబ్ ఫేజ్2 భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ ముఖ్య...

Breaking: జూన్ 30న ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు

విధాత‌, హైదరాబాద్: తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు జూన్ 30న విడుదల చేయనున్నారు. ఈ మేర‌కు ఎస్సెస్సీ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఉద‌యం 11:30 గంట‌ల‌కు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి...

ఇది రైతు బిడ్డ పరిపాలిస్తున్న ప్రభుత్వం: మంత్రి హ‌రీశ్‌రావు

విధాత, హైద‌రాబాద్ : రాష్ట్రంలో రైతు బంధు సంబరం మొద‌లైంద‌ని త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. తొలి రోజున ఒక ఎక‌రం వ‌ర‌కు భూమి క‌లిగిన 19,98,285 మంది రైతుల ఖాతాల్లో రూ. 586.66...

ఇంటర్‌లో అవిభక్త కవల‌లు వీణ, వాణిల అద్భుత ప్ర‌తిభ‌

విధాత‌, హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు ఈ రోజు విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాల్లో అవిభక్త కవలలైన వీణ-వాణిలు ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ మార్కులతో...