హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్ సందీప్ శాండిల్య సోమ‌వారం మ‌ధ్యాహ్నం స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. బంజారాహిల్స్‌లోని క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ నుంచి బ‌షీర్‌బాగ్ పాత సీపీ కార్యాల‌యానికి చేరుకున్న కాసేపటికే ఆయ‌నకు ఛాతీలో నొప్పి రావ‌డంతో ఇబ్బంది ప‌డ్డారు. దీంతో ఆయ‌న‌ను సిబ్బంది హుటాహుటిన హైద‌ర్‌గూడ‌లోని అపోలో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వైద్యులు సీపీకి చికిత్స అందించారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉంద‌ని వైద్యులు పేర్కొన్నారు. సీపీని సీఐడీ చీఫ్ మ‌హేశ్ భ‌గ‌వ‌త్ పరామ‌ర్శించి, ఆరోగ్య వివ‌రాలు తెలుసుకున్నారు.


త‌న ఆరోగ్య ప‌రిస్థితిపై సందీప్‌ శాండిల్య సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. తనకు గిల్టీనెస్‌ ప్రాబ్లమ్‌ రాగానే అపోలో ఆస్ప‌త్రికి వెళ్లాన‌ని తెలిపారు. స్వల్ప స్పాండిలైటిస్‌ ఉందని, లోబీపీ ఉందని వైద్యులు తెలిపార‌ని పేర్కొన్నారు. ఒక్కరోజు వైద్యుల పర్యవేక్షణలో ఉండి, రేపటి నుంచి తిరిగి తన విధులలోకి చేరుతాను. ప్ర‌స్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నాన‌ని ఆ వీడియోలో సీపీ స్ప‌ష్టం చేశారు.

Updated On
Subbu

Subbu

Next Story