కొనుగోలుదారులకు బంగారం, వెండి ధరలు షాక్ ఇచ్చాయి. బులియన్ మార్కెట్‌లో శనివారం ధరలు భారీగా పెరిగాయి.

విధాత: కొనుగోలుదారులకు బంగారం, వెండి ధరలు షాక్ ఇచ్చాయి. బులియన్ మార్కెట్‌లో శనివారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.600 పెరిగి తులానికి రూ.56,500 పలుకుతున్నది. 24 క్యారెట్ల బంగారంపై రూ.650 పెరిగి తులానికి రూ.61,670కి ఎగిసింది. అదే సమయంలో వెండి కిలోకు రూ.1500 పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో పుత్తడి ధరలను పరిశీలిస్తే ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.56,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ. 61,840కి చేరింది.
ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.56,550 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.61,690కి పెరిగింది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.57వేలు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.62,180కి పెరిగింది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.56,550 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.61,690కి చేరింది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు దేశంలో వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. ఒకే రోజు ఏకంగా రూ.1500 పెరిగి కిలో రూ.76,500కి చేరింది. ఇక హైదరాబాద్‌లో కిలో బంగారం రూ.78,500 పలుకుతున్నది.
