బంగారం ధరలు కొనుగోలుదారులకు స్వల్ప ఊరటనిచ్చాయి. ఇటీవల వరుసగా పెరుగుతూ వచ్చిన ధరలు నిన్న నిలకడగా ఉండగా.. సోమవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి

విధాత‌: బంగారం ధరలు కొనుగోలుదారులకు స్వల్ప ఊరటనిచ్చాయి. ఇటీవల వరుసగా పెరుగుతూ వచ్చిన ధరలు నిన్న నిలకడగా ఉండగా.. సోమవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్స్‌, 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.50 చొప్పున ధర తగ్గింది. 22 క్యారెట్ల గోల్డ్‌ తులానికి రూ.56,500 పలుకుతుండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.61,640 ధర పలుకుతున్నది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల స్వర్ణం రూ.57,050 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.62,230 పలుకుతున్నది.

ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.56,500 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.61,640కి తగ్గింది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.56,650 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.61,650 వద్ద కొనసాగుతున్నది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.56,500 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.61,640 పలుకుతున్నది. ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధర స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో కిలోకు రూ.79వేలు పలుకుతున్నది.

Updated On
Somu

Somu

Next Story