జపాన్‌కు చెందిన ఆటోమొబైల్‌ దిగ్గజం హోండా కంపెనీ భారత మార్కెట్‌లోకి సరికొత్త బైక్‌ను తీసుకువచ్చింది. సీబీ350 పేరుతో బైక్‌ను హోండా లాంచ్‌ చేసింది.

విధాత‌: జపాన్‌కు చెందిన ఆటోమొబైల్‌ దిగ్గజం హోండా కంపెనీ భారత మార్కెట్‌లోకి సరికొత్త బైక్‌ను తీసుకువచ్చింది. సీబీ350 పేరుతో బైక్‌ను హోండా లాంచ్‌ చేసింది. అయితే, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 మోడల్‌కు పోటీగా హోండా బైక్‌ను తీసుకువచ్చింది. ఈ బైక్‌ లుక్‌ ఆకర్షిణీయంగా ఉన్నది. సర్క్యులర్​ ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్​ ఇందులో ఉంటుంది. ప్రెషియెస్​ రెడ్​ మెటాలిక్​, పర్ల్​ ఇగ్నియస్​ బ్లాక్​, మాట్​ క్రస్ట్​ మెటాలిక్​, మాట్​ మార్షనల్​ గ్రీన్​ మెటాలిక్​, మాట్​ డూన్​ బ్రౌన్​ తదితర కలర్స్‌లో వస్తుంది.

వీటికి బ్రౌన్​ లెథర్​ సీట్​ వస్తుండగా.. ఆల్​-ఎల్​ఈడీ లైట్​ సెటప్​, స్మార్ట్​ఫోన్​ కనెక్టివిటీతో కూడిన సెమీ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, హోండా సెలెక్టెబుల్​ టార్క్​ కంట్రోల్​, ఎమర్జెన్సీ స్టాప్​ సిగ్నల్​ తదితర ఫీచర్స్‌ బైక్‌ను హోండా తీసుకువచ్చింది. ఇక ఈ బైక్‌లో 348 సీసీ, ఎయిర్​ కూల్డ్​, సింగిల్​ సిలిండర్​ ఇంజిన్​ ఉంటుంది. హోండా హైనెస్​ సీబీ350, సీబీ350ఆర్​ఎస్​లోనూ ఇదే ఇంజిన్‌తో వస్తుంది.

ఇక 20.78 హెచ్​పీ పవర్​ని, 30 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. 5 స్పీడ్​ గేర్​ బాక్స్​ సెటప్‌ ఉంటుంది. ఫ్రెంట్​లో టెలిస్కోపిక్​ ఫోర్క్స్​, రేర్​లో డ్యూయెల్​ షాక్​ అబ్సార్బర్స్​ వస్తుండగా.. హోండా సీబీ350 రెండు వీల్స్​కి డిస్క్​ బ్రేక్స్​, డ్యూయెల్​ ఛానెల్​ ఏబీఎస్​ని ఇస్తుంది. హోండా హైనెస్​ సీబీ350, సీబీ350ఆర్​ఎస్​ ప్లాట్​ఫామ్​పైనే సీబీ350ని సైతం హోండా రూపొందించింది. హోండా కొత్త బైక్​లో డీఎల్​ఎక్స్​, డీఎల్​ఎక్స్​ ప్రో రెండు వేరియంట్స్​ ఉన్నాయి. హోండా సీబీ350 ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ.1.99లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.

Updated On
Somu

Somu

Next Story