విధాత:క్రికెట్ ప్రియులకు రిలయన్స్ జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది. త్వరలో ఐపీఎల్ 2021 సెప్టెంబర్ 19 నుంచి తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో రిలయన్స్ జియో 5 సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. డిస్నీ+ హాట్ స్టార్ కంటెంట్ లైబ్రరీ కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ అందించే కొత్త ఐదు ప్రీపెయిడ్ ప్లాన్లను జియో ప్రారంభించింది. ఇప్పటి వరకు, జియో డిస్నీ+ హాట్ స్టార్ విఐపి సబ్ స్క్రిప్షన్ కింద లైవ్ స్పోర్ట్స్, హాట్ స్టార్ స్పెషల్స్, మూవీలు, […]

విధాత:క్రికెట్ ప్రియులకు రిలయన్స్ జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది. త్వరలో ఐపీఎల్ 2021 సెప్టెంబర్ 19 నుంచి తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో రిలయన్స్ జియో 5 సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. డిస్నీ+ హాట్ స్టార్ కంటెంట్ లైబ్రరీ కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ అందించే కొత్త ఐదు ప్రీపెయిడ్ ప్లాన్లను జియో ప్రారంభించింది. ఇప్పటి వరకు, జియో డిస్నీ+ హాట్ స్టార్ విఐపి సబ్ స్క్రిప్షన్ కింద లైవ్ స్పోర్ట్స్, హాట్ స్టార్ స్పెషల్స్, మూవీలు, టివి షోలకు యాక్సెస్ లభించేది.

ఈ కొత్త రిలయన్స్ జియో ప్లాన్ డిస్నీ+ హాట్ స్టార్ కింద పైన పేర్కొన్న ప్రయోజనాలతో పాటు డిస్నీ+ ఒరిజినల్స్, డిస్నీ, మార్వెల్, స్టార్ వార్స్, నేషనల్ జియోగ్రాఫిక్, హెచ్ బీఓ, ఎఫ్ఎక్స్, షోటైమ్, ఇతర అంతర్జాతీయ కంటెంట్ కొత్త లైబ్రరీ ఆస్వాదించవచ్చు. ఈ ప్లాన్ ధరలు వరుసగా రూ.499(వాలిడిటీ 28 రోజులు), రూ.666(వాలిడిటీ 56 రోజులు), రూ.888 (వాలిడిటీ 84 రోజులు), రూ.2,599(వాలిడిటీ 365 రోజులు)గా ఉన్నాయి. రూ.499 రిచార్జ్ ప్లాన్ కింద జుకు 3జిబి డేటాను అందిస్తుండగా, మిగిలిన మూడు ప్లాన్స్ కింద రోజుకు 2 జీబీ డేటా లభిస్తాయి.

అలాగే, ఇంకా రోజుకు 1.5 జీబీ డేటా అదనంగా కావాలంటే డేటా యాడ్-ఆన్ ప్లాన్ రూ.549ను రిచార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ 56 రోజుల వాలిడిటీని కలిగి ఉంటుంది. రూ.549 యాడ్-ఆన్ ప్లాన్ మినహా అన్ని కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు అపరిమిత వాయిస్, ఎస్ఎమ్ఎస్ బెనిఫిట్స్ లభిస్తాయి.

Updated On 31 Aug 2021 12:31 PM GMT
Venkat

Venkat

Next Story