విధాత:ఓలా తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ నెల 15న భారత్‌లో విడుదల కానుంది. స్వాతంత్ర దినోత్సవం రోజున విడుదల అవుతున్న ఈ స్కూటర్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్లను అదే రోజున వెల్లడిస్తామని ఓలా క్యాబ్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో భావిష్ అగర్వాల్ తెలిపారు. ఓలా ప్రస్తుతం రూ. 499తో స్కూటర్లకు బుకింగ్ కూడా తీసుకుంటోంది. ఓలా స్కూటర్‌లో బూట్ స్పేస్ ఎక్కువగా ఉండడం గమనార్హం.ఇందులో రెండు హెల్మెట్లను స్టోర్ చేసుకోవచ్చు. ఆగస్టు 15న స్కూటర్లను లాంచ్ చేస్తున్నట్టు ట్వీట్ […]

విధాత:ఓలా తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ నెల 15న భారత్‌లో విడుదల కానుంది. స్వాతంత్ర దినోత్సవం రోజున విడుదల అవుతున్న ఈ స్కూటర్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్లను అదే రోజున వెల్లడిస్తామని ఓలా క్యాబ్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో భావిష్ అగర్వాల్ తెలిపారు. ఓలా ప్రస్తుతం రూ. 499తో స్కూటర్లకు బుకింగ్ కూడా తీసుకుంటోంది. ఓలా స్కూటర్‌లో బూట్ స్పేస్ ఎక్కువగా ఉండడం గమనార్హం.ఇందులో రెండు హెల్మెట్లను స్టోర్ చేసుకోవచ్చు.

ఆగస్టు 15న స్కూటర్లను లాంచ్ చేస్తున్నట్టు ట్వీట్ చేసిన అగర్వాల్ స్కూటర్ల ఫొటోలను కూడా షేర్ చేశారు. వివిధ రంగుల్లో ఉన్న ఈ స్కూటర్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. ప్రస్తుతం రూ. 499తో స్కూటర్‌ను రిజర్వు చేసుకునేలా ముందస్తు బుకింగులు స్వీకరిస్తున్నారు. కావాలనుకున్న వారు కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి బుకింగ్ చేసుకోవచ్చు. ఫలితంగా డెలివరీ ప్రకటన వచ్చిన వెంటనే ప్రాధాన్య జాబితాలో మన పేరు ఉంటుంది. అంతేకాదు, యూజర్ ఎప్పుడైనా తన బుకింగును రద్దు చేసుకుని పూర్తి రిఫండ్‌ను పొందొచ్చు.

ఓలా స్కూటర్లలో పది రంగుల వేరియంట్లు ఉన్నాయి. బుకింగులు ప్రారంభమైన తొలి 24 గంటల్లోనే ఏకంగా లక్షకు పైగా రిజర్వేషన్లు వచ్చినట్టు కంపెనీ తెలిపింది. చార్జింగ్ సమస్యలను పరిష్కరించేందుకు 400 నగరాల్లో లక్షకుపైగా చార్జింగ్ పాయింట్లను నెలకొల్పేందుకు రెడీ అయింది. ఈ చార్జింగ్ పాయింట్లలో 18 నిమిషాలపాటు చార్జింగ్ చేస్తే 75 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.

తమిళనాడులోని ఓలా ఫ్యూచర్‌ఫ్యాక్టరీలో ప్రస్తుతం వీటిని తయారు చేస్తోంది. తొలి దశలో ఏడాదికి 2 మిలియన్ బైక్‌ల ఉత్పత్తి సామర్థ్యం ఉండగా వచ్చే ఏడాది నాటికి 10 మిలియన్లకు పెంచాలని లక్ష్యంగా పెంచుకుంది. ఓలా స్కూటర్ ధర 80 వేల నుంచి లక్షల రూపాలయ మధ్య ఉండే అవకాశం ఉంది.

Updated On 5 Aug 2021 5:40 AM GMT
Venkat

Venkat

Next Story