చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ కంపెనీ ఒప్పొ మరో కొత్త మోడల్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సన్నద్ధమవుతున్నది. ఈ మోడల్‌కు ఒప్పొ ఫైండ్‌ ఎక్స్‌7గా నామకరణం చేసింది

విధాత‌: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ కంపెనీ ఒప్పొ మరో కొత్త మోడల్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సన్నద్ధమవుతున్నది. ఈ మోడల్‌కు ఒప్పొ ఫైండ్‌ ఎక్స్‌7గా నామకరణం చేసింది. అయితే, ఈ మోడల్‌ త్వరలో లాంచ్‌ చేయనుండగా.. అంతకు ముందే ఆన్‌లైన్‌లో ఫీచర్స్‌ ఆన్‌లైన్‌లో లీక్‌ అయ్యాయి.

ఒప్పొ ఫైండ్‌ ఎక్స్‌6 మోడల్‌కు సక్సెసర్‌గా ఫైండ్‌ ఎక్స్‌7ను తీసుకువస్తుంది. ఆన్‌లైన్‌లో లీకైన వివరాల ప్రకారం.. ఫోన్‌లో 120హెచ్‌జెడ్‌ డిస్‌ప్లే ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత కలర్‌ ఓఎస్‌ 14 యూసీతో రానున్నది. అలాగే, ఫైండ్‌ ఎక్స్‌7లో సరికొత్తగా హైపర్‌టోన్‌ కెమెరాతో రానున్నది. అలాగే శాటిలైట్‌ కనెక్టివిటీ ఫీచర్స్ ఉంటాయని సంస్థ గతంలో ప్రకటించింది.

ఇక ఈ సిరీస్‌లో ఒప్పొ ఫైండ్‌ ఎక్స్‌7తో పాటు ఫైండ్‌ ఎక్స్‌7 ప్రో ఉండనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ప్రో మోడల్‌లో క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 చిప్‌సెట్‌ ఉండొచ్చని టాక్‌. సోనీ సరికొత్త 1 ఇంచ్‌ ఎల్‌వైటీ-900 కెమెరా సెన్సార్‌ కూడా ఉంటుందని సమాచారం. అయితే, ఒప్పొ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఎప్పుడు తీసుకువస్తుందనే విషయంపై క్లారిటీ లేదు. 2024 తొలి త్రైమాసికంలో చైనాలో లాంచ్‌ చేయనున్నది తెలుస్తున్నది.

ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలున్నాయి. అప్పుడు ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్‌, ధర క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. మరో వైపు ఒప్పొ రెనో 11 సిరీస్‌పై పని చేస్తున్నట్లు టాక్‌. ఈ నెలలో చైనాలో నిర్వహించనున్న ఈవెంట్‌లో ఒప్పొ రెనో 11 సిరీస్‌ను లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తున్నది.

Updated On
Somu

Somu

Next Story