Currency Notes | క‌రెన్సీ నోట్లపై రాస్తే చెల్లుబాటు అవుతాయా? అనే ప్ర‌శ్న చాలా మంది మ‌దిలో మెదులుతుంటుంది. దీనిపై చాలా మందికి సందేహాం కూడా ఉంటుంది. ఈ సందేహాలు, అనుమానాల నేప‌థ్యంలో ఇటీవ‌ల క‌రెన్సీ నోట్ల‌కు సంబంధించి ఓ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. నోట్ల‌పై రాత‌లు రాస్తే చెల్ల‌వ‌ని, రిజ‌ర్వ్ బ్యాంకు చెప్పిన‌ట్లు ఆ వార్త‌లో రాసుకొచ్చారు. చ‌ట్ట‌రీత్యా నేరం అని కూడా రాసి ఉంచారు. అంతేకాదు దీన్ని న‌మ్మించేందుకు అమెరికాలోనూ ఇలాంటి […]

Currency Notes | క‌రెన్సీ నోట్లపై రాస్తే చెల్లుబాటు అవుతాయా? అనే ప్ర‌శ్న చాలా మంది మ‌దిలో మెదులుతుంటుంది. దీనిపై చాలా మందికి సందేహాం కూడా ఉంటుంది. ఈ సందేహాలు, అనుమానాల నేప‌థ్యంలో ఇటీవ‌ల క‌రెన్సీ నోట్ల‌కు సంబంధించి ఓ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. నోట్ల‌పై రాత‌లు రాస్తే చెల్ల‌వ‌ని, రిజ‌ర్వ్ బ్యాంకు చెప్పిన‌ట్లు ఆ వార్త‌లో రాసుకొచ్చారు. చ‌ట్ట‌రీత్యా నేరం అని కూడా రాసి ఉంచారు. అంతేకాదు దీన్ని న‌మ్మించేందుకు అమెరికాలోనూ ఇలాంటి చ‌ట్టం అమ‌ల‌వుతుందంటూ వదంతులు సృష్టించారు.

ఈ వార్త‌ల‌పై కేంద్రం స్పందించింది. ఇవ‌న్నీ త‌ప్పుడు వార్త‌ల‌ని ప్రెస్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ బ్యూరో(పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో తెలిపింది. క‌రెన్సీ నోట్ల‌ను శుభ్రంగా ఉంచాల‌నే ఉద్దేశంతోనే, వాటిపై ఎలాంటి అంకెలు, ప‌దాలు రాయ‌కూడ‌ద‌ని ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేసిన‌ట్లు పేర్కొంది. రాత‌ల వ‌ల్ల క‌రెన్సీ నోట్లు చూసేందుకు బాగుండ‌వ‌ని, దాని జీవిత కాలం కూడా త‌గ్గుతుంద‌ని తెలిపింది. కాబ‌ట్టి సోష‌ల్ మీడియాలో వైర‌ల‌య్యే వార్త‌ల‌ను న‌మ్మ‌కండి. అలాగ‌ని క‌రెన్సీ నోట్ల‌పై కూడా రాత‌లు రాయొద్దు.

Updated On 13 Jan 2023 4:19 PM GMT
subbareddy

subbareddy

Next Story