విధాత:గో రక్షకులు పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన సినిమా హీరోయిన్ సాయి పల్లవి పై సైదాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సాయిపల్లవి తన కొత్త చిత్రం విరాఠపర్వం సినిమా విడుదల నేపథ్యంలో ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు.
ఈ క్రమంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో ఉగ్రవాదులు ఎలాగైతే పండితులపై దాడి చేశారో అదేవిధంగా గోవులను తరలించే వారిపైన గో రక్షకులు దాడులు చేస్తున్నారంటూ మాట్లాడారు.
దీంతో ఈ వ్యాఖ్యలకు తీవ్రంగా ఖండిస్తూ సాయి పల్లవి వెంటనే బహిరంగంగా గో రక్షకులకు క్షమాపణ చెప్పాలని ఆమెపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ అఖిలభారత గో సేవ ఫౌండేషన్ అధ్యక్షుడు బాలకృష్ణ సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సాయి పల్లవి క్షమాపణలు చెప్పాలని లేకుంటే నేడు విడుదల కానున్న సినిమాను గో రక్షకులు అడ్డుకుంటామని హెచ్చరించారు.
(