
బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తూ వస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 కార్యక్రమం చివరి దశకు వచ్చేసింది. సక్సెస్ ఫుల్‌గా 11వారాలు పూర్తి చేసుకోగా, ఆదివారం ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగింది. ఎప్పటి మాదిరిగానే నాగార్జున హౌజ్‌మేట్స్‌తో గేమ్ ఆడించారు. ఫ్రెండ్‌ని చేసుకునేది ఎవర్ని, బ్లాక్ చేసేది ఎవర్నీ అనే టాస్క్ ఇవ్వగా, ఇందులో భాగంగా గౌతమ్.. ప్రశాంత్‌ని ఫ్రెండ్‌ని చేసుకుంటా అని, శోభాని బ్లాక్ చేస్తానని తెలిపారు. అమర్.. ప్రశాంత్‌ని ఫ్రెండ్ చేసుకుంటా అని, రతికని బ్లాక్ చేస్తా అని చెప్పారు. ఇక రతిక యావర్‌ని ఫ్రెండ్‌గా, అమర్‌ని బ్లాక్ చేస్తానని చెప్పింది. శోభా శెట్టి రతికని ఫ్రెండ్‌గా, గౌతమ్‌ని బ్లాక్ చేస్తానని, అలానే అశ్విని.. శోభాని ఫ్రెండ్‌గా, గౌతమ్‌ని బ్లాక్ చేస్తానని పేర్కొంది. యావర్.. శోభాని ఫ్రెండ్‌గా, గౌతమ్‌ని బ్లాక్ అని, ప్రశాంత్.. అమర్‌ని ఫ్రెండ్గా, గౌతమ్ బ్లాక్‌గా, అర్జున్.. శివాజీని ఫ్రెండ్‌గా, యావర్‌ని బ్లాక్‌గా, శివాజీ.. అర్జున్‌ని ఫ్రెండ్‌గా, రతికని బ్లాక్ చేస్తానని, ప్రియాంక.. ప్రశాంత్‌ని ఫ్రెండ్‌గా, రతికని బ్లాక్ చేస్తాననిపేర్కొన్నారు.
ఈ క్రమంలో ప్రశాంత్‌ని ఫ్రెండ్ చేసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపగా, గౌతమ్‌ని బ్లాక్ చేసేందుకు మెజారిటీ సభ్యులు ఓట్ వేశారు. ఇక ఆ తర్వాత ఫొటోలు చూపిస్తూ వాటిని గెస్ చేయాలని, అలానే ఆ పాటలకి డ్యాన్స్ లు కూడా చేయించారు నాగ్. మరోవైపు షోలో `కోటబొమ్మాళి` టీమ్ సందడి చేసింది. శ్రీకాంత్, శివానీ రాజశేఖర్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్ వచ్చి హౌజ్‌మేట్స్‌తో కలిసి సందడి చేశారు. ఇక ఎలిమినేషన్ టైం దగ్గర పడడంతో ఒక్కొక్కరి హార్ట్ బీట్ పెరిగింది.ఎవరు ఎలిమినేట్ అవుతారని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో చివరికి గౌతమ్, అశ్విని ఇద్దరు మిగిలారు. వారిద్దరు సేవ్ అయినట్టు ప్రకటించి వచ్చేవారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని తెలియజేశారు.
యావర్ ఫ్రీ ఎవిక్షన్ పాస్‌ని వెనక్కి ఇవ్వడం కారణంగా ఎలిమినేషన్ ని బిగ్ బాస్ ఎత్తేశాడని, ఈ సీజన్ అంతా ఉల్టాపుల్టా అని నాగ్ అన్నాడు. అయితే దీనిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. యావర్ ఎవిక్షన్ పాస్‌ని వెనక్కి ఇవ్వడానికి, ఎలిమినేషన్‌ని ఎత్తేయడానికి సంబంధం లేదు. ఎవరినో కాపాడటం కోసం ఇదంతా చేశారనే టాక్ వినిపిస్తుంది. ఎంటర్‌టైన్ చేసే తేజ, భోలేలను పంపించి పప్పు బ్యాచ్‌ని హౌజ్‌లో ఉంచారని విమర్శలు చేస్తున్నారు ప్రస్తుతం హౌజ్‌లో శివాజీ, అర్జున్, అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంక, అశ్విని, యావర్, పల్లవి ప్రశాంత్, రతిక, గౌతమ్ ఇలా పది మంది హౌజ్‌లో ఉండగా వచ్చేవారం ఇద్దరు హౌజ్ నుండి వెళ్లనున్నట్టు తెలుస్తుంది.
