విధాత:దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజూ పాజిటివ్‌ కేసుల సంఖ్య లక్షల్లో నమోదవుతున్నాయి. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. అయితే వీరిలో కొంతమంది కరోనాతో మరణిస్తే.. మరికొంత మంది సమయానికి ఆక్సిజన్‌ అందక చనిపోతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పలువురు ప్రముఖలు తమ వంతు సాయాన్ని అందిస్తున్నారు. కోవిడ్‌ బాధితుల కోసం విదేశాల నుంచి ఆక్సిజన్‌ రప్పించి, కొంతమందికి ఊపిరి పోస్తున్నారు. తాజాగా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ స్నేహితుడికి చెందిన గ్రీన్‌ కో సంస్థ […]

విధాత:దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజూ పాజిటివ్‌ కేసుల సంఖ్య లక్షల్లో నమోదవుతున్నాయి. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. అయితే వీరిలో కొంతమంది కరోనాతో మరణిస్తే.. మరికొంత మంది సమయానికి ఆక్సిజన్‌ అందక చనిపోతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పలువురు ప్రముఖలు తమ వంతు సాయాన్ని అందిస్తున్నారు. కోవిడ్‌ బాధితుల కోసం విదేశాల నుంచి ఆక్సిజన్‌ రప్పించి, కొంతమందికి ఊపిరి పోస్తున్నారు.


తాజాగా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ స్నేహితుడికి చెందిన గ్రీన్‌ కో సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి 1000 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను విరాళంగా అందించింది. చైనా నుంచి తెప్పించి వాటిని ప్రభుత్వానికి అందించారు. దీనిపై రామ్‌ చరణ్‌ ట్విటర్‌ వేదికగా స్పందించాడు. ‘ప్రభుత్వానికి 1000కి పైగా ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు అందిస్తున్న నా స్నేహితుడి సంస్థ గ్రీన్‌కో గ్రూపునకు కుడోస్‌. కరోనా సవాల్‌ విసురుతున్న ఇలాంటి కష్ట సమయాల్లో దేశంలోని ప్రభుత్వాసుపత్రులకు సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందించడం గొప్ప విషయం’ అని చరణ్‌ ట్వీట్‌ చేశారు.

Updated On 18 May 2021 11:38 AM GMT
subbareddy

subbareddy

Next Story