నటి త్రిషను రేప్ చేయాలనుందంటూ నటుడు మన్సూర్ అలిఖాన్ చేసిన వ్యాఖ్యలను మెగాస్టార్ చిరంజీవి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు

విధాత: నటి త్రిషను రేప్ చేయాలనుందంటూ నటుడు మన్సూర్ అలిఖాన్ చేసిన వ్యాఖ్యలను మెగాస్టార్ చిరంజీవి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. త్రిషపై మన్సూర్ చేసిన వ్యాఖ్యలు అరిస్టులకే కాదు ఏ మహిళలకైనా అసహ్యం కల్గించేలా ఉన్నాయని చిరంజీవి మండిపడ్డారు. త్రిషకు, అలాంటి వ్యాఖ్యలకు గురయ్యే ప్రతి మహిళకు అండగా ఉంటానన్నారు. మన్సూర్ వక్రబుద్ధితో కొట్టుమిట్టాడుతున్నాడన్నారు.


మన్సూర్ అలీఖాన్‌ వ్యాఖ్యలపై రోజురోజుకు వివాదం ముదురుతుంది. పలువురు నటులు, వివిధ రంగాల ప్రముఖులు ఆయన వ్యాఖ్యలను తప్పుబట్టారు. జాతీయ మహిళా కమిషన్ సైతం ఇప్పటికే సుమోటోగా తీసుకుని మన్సూర్ పై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. మన్సూర్ మాత్రం తాను తప్పుడు ఉద్దేశంతో అనలేదని, తన మాటలు ఎడిట్ చేసిన గిట్టని వారు వివాదస్పదం చేశారని వివరణ ఇచ్చినప్పటికి దీనిపై వివాదం మాత్రం చల్లారడం లేదు.

Updated On
Somu

Somu

Next Story