ఇటీవ‌లి కాలంలో అందాల ముద్దుగుమ్మ‌లు గ్లామ‌ర్ షోతో కుర్రాళ్ల హృద‌యాల‌ని దోచుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కెరీర్‌లో సినిమాలు, సీరియ‌ల్స్ సంగ‌తి ఎలా ఉన్నా కూడా హ‌ద్దులు చెరిపే విధంగా గ్లామ‌ర్ షో చేస్తూ కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారు. బిగ్ బాస్ వేదిక‌గా ఫేమ్ తెచ్చుకున్న భామ‌లు అయితే తెగ రెచ్చిపోతూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. సీజన్ 6లో పార్టిసిపేట్ చేసి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న ఇన‌య సుల్తానా ఇటీవ‌లి కాలంలో గ్లామ‌ర్ షోతో రెచ్చిపోతూ అంద‌రి మతులు పోగొట్టేలా చేస్తుంది. మేకప్ లేకుండా తన అసలైన గ్లామర్ పరిచయం చేస్తూ క్రేజీ వీడియోని చేసిన ఇన‌య‌పై నెటిజ‌న్స్ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇన‌య‌లో ఇంత గ్లామ‌ర్ ఉంద‌ని తెలియ‌ద‌ని, చూస్తుంటే మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌నిపించే అందం ఆమెద‌ని నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు.

బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న‌ప్పుడు ఇన‌య చేసిన అందాల ర‌చ్చ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎంతో బోల్డ్‌గా ఉంటూ మొహం మీద మాట్లాడుతూ అంద‌రి దృష్టి ఆక‌ర్షించింది. కంటెస్టెంట్ ఆర్జే సూర్య అంటే తనకు ఇష్టం అని కన్ఫెషన్ రూమ్ లో బిగ్ బాస్ కి చెప్పిన ఈ అమ్మ‌డు ఆయ‌న‌తో క‌లిసి చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఈ ఇద్ద‌రు ఒకే కంచంలో తింటూ, ముద్దులు, హగ్గులు లాగిస్తూ రొమాన్స్ చేయ‌గా, ఒకానొక ద‌శ‌లో వారిద్ద‌ర‌ని నాగార్జున కూడా హెచ్చ‌రించాల్సి వ‌చ్చింది. ఒకానొక స‌మ‌యంలో ఇన‌య టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం అయ్యింది. అనూహ్యంగా ఫైనల్ కి ముందు ఇనయ ఎలిమినేట్ అయి అంద‌రికి షాకిచ్చింది. ఆమె మీద రాను రాను వ్య‌తిరేఖ‌త వ్య‌క్తం కావ‌డంతో ఎలిమినేట్ అయింది

బిగ్ బాస్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత ఇనయ నటిగా ఎదిగే ప్రయత్నాలు చేస్తుంది. దీనిలో భాగంగా సోషల్ మీడియాలో హాట్ హాట్ వీడియోలు, ఫోటో షూట్స్ చేస్తూ రా అండ్ ర‌స్టిక్‌గా క‌నిపిస్తుంది. ఇన‌య బోల్డ్ లుక్స్ ప్ర‌తి ఒక్క‌రి మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నాయి. ఈ అమ్మ‌డు త‌న ఫొటోషూట్స్‌తో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విప‌రీతంగా పెంచుకుంటుంది. అస‌లు ఇన‌య‌ని రామ్ గోపాల్ వ‌ర్మ‌నే హైలైట్ చేశాడ‌ని చెప్పొచ్చు. ఓ ప్రైవేట్ పార్టీలో ఇద్దరూ మందు కొడుతూ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వర్మ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయ‌డంతో ఈ అమ్మ‌డికి పాపులారిటీ వ‌చ్చింది. ఆ పాపులారిటీతోనే బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టింది.

Updated On
sn

sn

Next Story