Janhvi Kapoor Peddi First Look : ‘పెద్ది’ నుంచి జాన్వీకపూర్ ఫస్ట్ లుక్ విడుదల

రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' నుంచి హీరోయిన్ జాన్వీకపూర్ ఫస్ట్ లుక్ విడుదలైంది. జాన్వీ ఈ చిత్రంలో అచ్చియ‌మ్మా అనే క్రికెట్ కామెంటేట‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నుంది.

Janhvi Kapoor first look poster from Peddi movie

విధాత : మెగా హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా నుంచి హీరోయిన్ జాన్వీకపూర్ పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో జాన్వీ అచ్చియ‌మ్మా అనే పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఇందులో జాన్వీ క్రికెట్ కామెంటేట‌ర్‌గా క‌నిపించ‌నుంది. “Fierce and Fearless జాన్వీ కపూర్ AS అచ్చియ్యమ్మ” అంటూ చిత్ర బృందం ఫస్ట్ లుక్ పోస్టర్ కు ట్యాగ్ పెట్టింది. జాన్వీ ఒక ఓపెన్ టాప్ జీప్‌లో నిలబడి, చేతులు జోడించి దండం పెడుతూ కనిపిస్తుంది. ‘పెద్ది’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2026 మార్చి 27న విడుదల కానుంది. పెద్ది’ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం శ్రీలంక‌లో కీల‌క‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు .ఈ నెల 8న రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరగనున్న ఏఆర్‌ రెహమాన్‌ లైవ్‌ కాన్సెర్ట్‌లోనే ఈ చిత్ర తొలి గీతాన్ని వినిపిచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు దర్శకుడు బుచ్చిబాబు సామాజిక మాధ్యమాల వేదికగా సంకేతాలు అందించారు. ., ఈ అమ్మడు అభిమానులను ఆకట్టుకుంటుంది. జాన్వీ ఒక ఓపెన్ టాప్ జీప్‌లో నిలబడి, చేతులు జోడించి దండం పెడుతూ కనిపిస్తుంది. ఆమె చుట్టూ జనం జాన్వీ ఎన్నికల ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తుంది

ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో రామ్ చరణ్‌తో పాటు కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండగా, రత్నవేలు సినిమాటోగ్రఫీ, కొల్లా అవినాష్ ఆర్ట్ డైరెక్షన్, నవీన్ నూలి ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జగపతిబాబు, దివ్యేందు భట్టాచార్య వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వృద్ధి సినిమాస్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.